Vijay Thalapathy 69 Title:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) చివరిగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The Goat) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘కస్టడీ’ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 5న విడుదలై విజయం అందుకుంది. ఆ తరువాత తన చివరి చిత్రంగా “దళపతి 69” (Thalapathy 69) వర్కింగ్ టైటిల్ తో సినిమాని ప్రారంభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయ్ దళపతి నుంచి వస్తున్న చివరి సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాను పూర్తి చేసి ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే సొంత పార్టీ పెట్టి ప్రజలలో తమ పార్టీ గురించి ప్రస్తావిస్తూ.. అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటు అభిమానులను హార్ట్ చేయకుండా.. చివరి సినిమాగా చేసి శాశ్వతంగా సినిమా రాజకీయాల్లోకి వెళ్లిపోనున్నట్లు ఆయన ప్రకటించారు.
“దళపతి 69”..
అందులో భాగంగానే హెచ్. వినోత్ (H.Vinoth) దర్శకత్వంలో దళపతి 69 సినిమాను ప్రకటించారు విజయ్ దళపతి. ఇందులో పూజా హెగ్డే (Pooja hegde)మళ్లీ ఆయనతో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యింది. అలాగే బాబీ డియోల్(Bobby Deol), యంగ్ బ్యూటీ మమిత బైజు(Mamitha Baiju)తోపాటు ప్రియమణి (Priyamani), ప్రకాష్ రాజ్ (Prakash Raj) వంటి భారీ తారాగణం ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు సినిమాపై అంచనాలను బాగా పెంచేయగా.. ఇక ఈ సినిమా టైటిల్ కోసం అలాగే ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇలాంటి వారికి శుభవార్త తెలియజేసింది చిత్ర బృందం.
ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్..
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేయనున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా తమిళ్ లో ‘నాళయ్య తీర్పు’.. తెలుగులో ‘రేపటి తీర్పు’ గా టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికి అయితే ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
టైటిల్ ప్రత్యేకత ఏంటంటే..?
ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విజయ్ దళపతి.. దళపతి 69 మూవీ కోసం ప్రకటించబోయే టైటిల్ ఆసక్తికరంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ దళపతి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన మొదటి సినిమా టైటిల్ పేరు నాళయ్య తీర్పు. 1992లో వచ్చిన ఈ సినిమాకి యస్. ఏ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా.. ఆయన భార్య శోభా చంద్రశేఖర్ నిర్మించారు.ఇందులో శ్రీవిద్య, రాధా రవి, శరత్ బాబు, కీర్తన, ఈశ్వరి రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇకపోతే ఈ సినిమా 1992 డిసెంబర్ 4న విడుదల అయింది. కానీ రూ.10లక్షల మేర నష్టాన్ని మిగిల్చిందని సమాచారం. అయినప్పటికీ ఇందులో విజయ్ నటనకు ఉత్తమ నూతన ముఖ నటుడిగా ‘సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు’ లభించింది. ఇకపోతే 33 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సినిమా టైటిల్ ను తన చివరి సినిమాకు విజయ్ దళపతి పెట్టడంపై ఈ విషయం కాస్త ఆశ్చర్యకరంగా మారింది అని చెప్పవచ్చు.