IT Raids in Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత మూడు రోజులుగా ఐటీ అధికారులు బడా నిర్మాతల నివాసాలలో, ఆఫీసుల్లో నిర్వహిస్తున్న సోదాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల బడ్జెట్, వచ్చిన కలెక్షన్స్ కారణంగానే సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 200 మంది ఐటి అధికారులు దిల్ రాజు(Dilraju), హన్సితా రెడ్డి(Hanshitha reddy), అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal), మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై రవిశంకర్(Y.Ravi shankar), డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) తోపాటు మరికొంతమంది నిర్మాతల నివాసాలలో, ఆఫీసులతో పాటు వీరి బంధువుల నివాసాలలో కూడా సోదాలు నిర్వహించారు. ఇక మొన్నటితో సుకుమార్ ఇంట్లో సోదాలు పూర్తిచేసిన అధికారులు, నిన్నటితో దిల్ రాజు ఇంట్లో సోదాలు ముగించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు..
సినీ ప్రముఖుల నివాసాలలో, ఆఫీసులలో జరిగిన ఐటీ సోదాలు నిన్నటితో ముగిశాయి. మూడు రోజుల పాటు 16 చోట్ల సోదాలు చేసిన ఐటీ అధికారులు.. 55 బృందాలుగా సినీ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేశారు. అటు దిల్ రాజు ఇంట్లో కూడా దాదాపు మూడు రోజులపాటు సాగిన ఐటీ సోదాలు నిన్నటితో పూర్తి అయ్యాయి. ముఖ్యంగా దిల్ రాజు రామ్ చరణ్(Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం దాదాపు రూ.450 కోట్లు ఖర్చు పెట్టగా.. మొదటి రోజే రూ.186 కోట్లు వచ్చినట్లు పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇదే సంక్రాంతికి వెంకటేష్(Venkatesh) హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఏకంగా రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు పోస్టర్స్ వచ్చాయి . ఈ నేపథ్యంలోనే అధికారులు.. సినిమా బడ్జెట్ లెక్కలు, వచ్చిన కలెక్షన్స్ వివరాలన్నింటిని తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమాలను నిర్మించడానికి దిల్ రాజు ఫైనాన్స్ తీసుకొచ్చారట. వాటి గురించి కూడా ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమాకు సంబంధించిన అన్ని లెక్కలు చూసినట్లు సమాచారం. మరి అన్ని లెక్కలు తేలాయా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు పూర్తవడంతో ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది.
కోలుకున్న దిల్ రాజు తల్లి..
ఇదిలా ఉండను ఒకవైపు దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా.. మరొకవైపు దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఐటీ అధికారుల వెహికల్లోనే దిల్ రాజు తల్లిని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు అలాగే ఒక ఐటి మహిళా అధికారి కూడా హాస్పిటల్ కి వెళ్లినట్లు సమాచారం ఇక ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐటీ సోదాలపై స్పందించిన వెంకటేష్, అనిల్ రావిపూడి..
ఇదిలా ఉండగా గత మూడు రోజులుగా దిల్ రాజు ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం వెంకటేష్ తనకు తెలియదని తెలిపారు. ఇక ఇదే విషయంపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్రతి రెండేళ్లకొకసారి ఐటీ అధికారులు సోదాలు చేయడం సర్వసాధారణం. ప్రస్తుతం నా ఇంట్లో అయితే దాడులు జరగలేదు అంటూ తెలిపారు.