SSMB29 Movie: టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకు ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు పూర్తయింది. ఇటీవలే ఈ మూవీ కి కొబ్బరికాయ కొట్టి షూటింగ్ కి ముహూర్తం పెట్టారు రాజమౌళి. ఈ మూవీ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో నటించేందుకు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ని దించాడు రాజమౌళి.. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోకి అడుగు పెట్టింది. అయితే లుక్ టెస్ట్ ముగిసిన తర్వాత సినిమా కోసం రాజమౌళి ప్రియాంక చోప్రావి బల్క్ డేట్స్ అడిగినట్టు తెలుస్తుంది. ఐతే జక్కన్న అడిగిన డేట్స్ అడ్జెస్ట్ అవుతాయా లేదా అన్నది ఆసక్తి మారింది.
SSMB29 మూవీ..
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు.. ఇప్పటికే మహేష్ బాబు లుక్కు పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం హైదరాబాదులోని అల్యుమినియం ఫ్యాక్టరీలో సినిమాకు సంబందించిన వర్క్ షాప్ జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ కి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్న రాజమౌళి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట.. అందుకే షూటింగ్ ను గ్యాప్ లేకుండా చెయ్యాలని భావిస్తున్నారు. ఈ మూవీని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె లె నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉండబోతుందట.. ఇక రాజమౌళి సినిమాలంటే బడ్జెట్ ఓ రేంజ్ లో ఉంటాయి అలాగే ఈ సినిమా కూడా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ను కేటాయించిన ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజమౌళికి ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్..
ప్రియాంక చోప్రా ఈ సినిమా లుక్ టెస్ట్ కోస్మ్ హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.. నిన్న చిలకూరి బాలాజీ టెంపుల్ లో సందడి చేశారు.. తాజాగా ఈ మూవీ కోసం ఈమె లుక్ టెస్ట్ ముగిసింది. ఈ మూవీ కోసం రాజమౌళి ప్రియాంక చోప్రావి బల్క్ డేట్స్ అడిగినట్టు తెలుస్తుంది. అయితే జక్కన్న అడిగిన డేట్స్ ఇవ్వడానికి ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో రాజమౌళి హాలీవుడ్ ని టచ్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాను సాధ్యమైంత త్వరగా పూర్తి చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.. ఈ ఏడాది దాదాపు షూటింగ్ పూర్తి చేసి 2027లో కల్లా ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని జక్కన్న ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. మరి సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో చూడాలి..