BigTV English

Family Star Movie Unit Complaints: విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’.. అలా చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు

Family Star Movie Unit Complaints: విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’.. అలా చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు
Family Star Movie Unit Complaint
Family Star Movie Unit Complaint

Family Star Movie Unit Filed Cyber Crime Complaint: సాధారణంగా ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిందంటే ప్రీమియర్ షో లేదా ఫస్ట్ షో లోనే దాని రిజల్ట్ తేలిపోతుంది. ఎన్నో ఏళ్లుగా తీసిన సినిమా అయినా ఒక్క రెండు మూడు గంటల్లో హిట్టా, ఫట్టా అనేది నిర్ణయించబడుతుంది. అయితే కొన్ని సినిమాలు అద్భుతంగా ఉన్నా.. కొన్నిసార్లు నెగెటివ్ ప్రచారం జరుగుతుంది.


సినిమా చూసిన వారు బాగుందని అంటే.. సోషల్ మీడియాలో మాత్రం సినిమా ఏం బాగోలేదని.. అనవసరంగా టైం వేస్ట్ అయిందని దుష్ప్రచారం చేస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితే ఓ స్టార్ హీరో సినిమాకు వచ్చింది. సినిమా చూసిన వారంతా చాలా బాగుందని అంటుంటే.. సోషల్ మీడియాలో మాత్రం చాలా వేస్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు. విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఫస్ట్ షో నుంచే ఈ మూవీపై ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెగెటివ్ టాక్ నడుస్తోంది. దీంతో సినిమా సినిమాను చూద్దాం అనుకున్న వారు కూడా థియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై మూవీ నిర్మాతలు, విజయ్ దేవరకొండ టీం సీరియస్ అయింది. సోషల్ మీడియాలో ఈ మూవీపై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్న గ్రూప్స్, అకౌంట్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Also Read: Vijay Devarakonda: మావాడి కటౌట్ చూసి భయపడుతున్నారా.. విజయ్ మేనమామ సంచలన వ్యాఖ్యలు

ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ తమ సినిమాపై నెగటివిటీని స్ప్రెడ్ చేయడమే పనిగా పెట్టుకొని నష్టం కలిగిస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. వెంటనే కేసుని విచారించి నిందుతులను పట్టుకుంటామని మూవీ టీంకు తెలిపారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×