Yash Rangineni Comments on Vijay Devarakonda’s Trolls: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీని ఏలుతున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు విజయ్. ఈ సినిమా తరువాత విజయ్ ను స్టార్ హీరో చేసింది అర్జున్ రెడ్డి. ఇక అర్జున్ రెడ్డి .. విజయ్ ను వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది. అయితే ఇక్కడ సినిమాల కన్నా అతని కాన్ఫిడెంట్ కు అభిమానులు ఫిదా అయ్యారు. తనను తాను నిలబెట్టుకున్న విధానానికి ఫ్యాన్స్ గా మారిపోయారు. అలా రౌడీ హీరో అభిమానులకు దగ్గరయ్యాడు.
ఇక విజయ్ వ్యక్తిత్వం నచ్చని కొందరు అతనికి కిందకు లాగుతూనే ఉన్నారు అనేది కొంతమంది అభిప్రాయం. అలాంటివారే విజయ్ నటించిన ప్రతి సినిమాకు నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ సినిమాకు కూడా నెగెటివ్ ట్రోల్స్ రావడంతో నిర్మాత దిల్ రాజు.. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ పై ఎందుకింత కోపం, కసి, పగ అని ఆయన మేనమామ యష్ రంగినేని ట్విట్టర్ ద్వారా తన అసహనాని వ్యక్తం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
“ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారు. ఇంత కసా ? ఇంత ఓర్వలేని తనమా ? లేక మావోడి కటౌట్ చూసి భయమా ? ఒక మంచి విలువలతో, సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలటం లేదు. మీ నెగటివ్ బ్యాచ్ కి వాడంటే ఎలాగూ పడదు. కానీ ఆ ఇష్టపడేవాళ్ళని కూడా సినిమాకి రానివ్వకుండా చేస్తున్నారేంటిరా బాబు. ఐనా ఇంకే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకి మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఏ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరుతెచ్చుకుంటే తప్పా?..” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read: RT75: రవన్న దావత్ కు రెడీ అయిపొండ్రి..
ఇక ఈ పోస్ట్ కు నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. మంచి కథలను ఎంచుకొని సినిమాలు తీస్తే.. నెగెటివ్ ట్రోల్స్ ఎందుకు వస్తాయి. ఎదిగే సమయంలో అవమానాలు తప్పదు.. అలా అవమానాలు పడితేనే స్టార్లు అవుతారు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.
We will fight on 💪.
The Sun will rise again 💥 pic.twitter.com/d0UIRm27Ie— Yash Rangineni (@YashBigBen) April 7, 2024