BigTV English

Family Star release date : కష్టాల్లో ఫ్యామిలీ స్టార్.. పాపం విజయ్ దేవరకొండ..

Family Star release date : కష్టాల్లో ఫ్యామిలీ స్టార్.. పాపం విజయ్ దేవరకొండ..
Family Star release date

Family Star release date : విజయ్ దేవరకొండ.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్. గీత గోవిందం మూవీతో యూత్ లో విజయ్ దేవరకొండ కు మాంచి క్రేజ్ ఏర్పడింది. కెరియర్ ఆరంభంలో మంచి హిట్  అందుకున్న ఈ నటుడు ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. లైగర్ భారీ డిజాస్టర్ అయిన తర్వాత విజయ్ కెరీర్ లో మరొక హిట్ లేదు.


ఖుషి అంటూ రొమాంటిక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయాడు. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న ఈ రౌడీ బాయ్ తన నెక్స్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. విజయ్ 13వ చిత్రం కావడంతో ఫ్యామిలీ స్టార్ పై అతని అభిమానులకు కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. రేపు సంక్రాంతి బరిలోకి ఈ చిత్రం దిగుతుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే సడన్ గా ఈ మూవీ నుంచి వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ కాసేపు అందరిని కన్ఫ్యూజ్ చేస్తోంది.

ఏ మూవీలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది..ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రం సంక్రాంతికి రెడీ అవుతుంది అనుకుంటున్నా టైం లో.. విడుదల సంక్రాంతికి కాదు అన్న టాక్ వైరల్ అయింది. మూవీ షూటింగ్ ఆలస్యం కావడమే దీనికి మెయిన్ రీజన్ అని తెలుస్తుంది. ఏదో రిలీజ్ చేయాలి అని హడావిడిగా పూర్తి చేసి రిలీజ్ చేస్తే సినిమా ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ మూవీ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి వచ్చే సమ్మర్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే దీని రాజ్ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చే సంవత్సరం మార్చి 22వ తారీకున విడుదలవుతుందట.. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం. మరో పక్క ఈ మూవీ నుంచి కంగారులో కొబ్బరికాయ మర్చిపోయాను.. ఐరనే వంచాలా ఏంటి..? లాంటి డైలాగ్స్ ఇప్పటికే బాగా వైరల్ అయ్యాయి. సంక్రాంతికి బరిలో ఆల్రెడీ చాలా చిత్రాలు ఉన్నాయి కాబట్టి హడావిడిగా రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకున్నారా ఏమో సమ్మర్ కి డేట్ షిఫ్ట్ చేశారు.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×