BigTV English

Vijay Devarkonda : సూర్య సినిమాల్లో అది ఎప్పటికీ బ్రెయిన్ లో నుంచి పోదు – విజయ్

Vijay Devarkonda : సూర్య సినిమాల్లో అది ఎప్పటికీ బ్రెయిన్ లో నుంచి పోదు – విజయ్

Vijay Devarkonda: వేసవికాలం వచ్చిందంటే పెద్ద హీరోల సినిమాల కోసం అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు. మే నెల మొదటి రోజే రెండు సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ఒకటి నాని హిట్ 3 మరొకటి సూర్యా రెట్రో. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్స్టర్ లవ్ యాక్షన్ సినిమా రెట్రో.. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చీఫ్ గెస్ట్ గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వచ్చి అలరించారు. ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ సూర్య సినిమాల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


ఆ సినిమా నా ఫెవరెట్ ..

యాంకర్ సుమ విజయ్ దేవరకొండ ని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడుగుతుండగా.. అందులో భాగంగా సూర్య సినిమాలలో మీకు నచ్చే సినిమా ఏది అని విజయ్ ని అడగగా.. విజయ్ మాట్లాడుతూ ..’నేను టెన్త్, ఇంటర్లో ఉన్నప్పుడు గజినీ సినిమా చూశాను. అదే మొదటిసారి నేను సూర్య సినిమా చూడటం.. అప్పుడు థియేటర్ కు వెళ్లి ఎక్స్పీరియన్స్ వేరేగా ఉండేది. పొద్దున్నే న్యూస్ పేపర్ తీసి దగ్గరలో ఏం సినిమా ఏ థియేటర్లో ఆడుతుందో చూసి క్యూలో వెళ్లి నిలబడి టికెట్స్ సంపాదించి, మనం లోపలికి వెళ్లి థియేటర్ డోర్ దగ్గర నిలబడగానే గజినీ సినిమా టైటిల్ కనబడుతుంది. ఒక్కసారిగా కేకలు వేయడం, అప్పట్లో బాగుండేది. నేను ఆ తర్వాత సూర్య అన్న మిగిలిన సినిమాలన్నీ చూశాను. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చాలా ఇష్టం. ఆ సినిమాలో చంచల సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ లో కలిగిన ఎమోషన్ ఎక్సపీరియన్స్ ఇప్పటివరకు నేను మర్చిపోను. నా చిన్నతనంలో ఆ సాంగ్ నిజంగా నాకు కనెక్ట్ అయింది. నాకు యాక్టర్ అవుదామని 20 ఇయర్స్ ఉన్నప్పుడు. నాకు ఎక్కువగా సూర్యని కలవాలని అనిపించింది. నేను కొంచెం ఓవర్ వెయిట్ కిడ్డు లాగా ఉన్నాను. ఈయన లాంటి బాడీ నేను ఎలా చేయాలి అని, డిసిప్లిన్ ఎలా వచ్చింది అని, ఈ మనిషి డాన్స్ ఆలా ఎలా వేస్తాడు అని ఒకసారి సూర్య అన్నని కలవాలి అని నేను అనుకున్నాను. చాలా మందిని కనుక్కున్నాను. చెన్నైలో ఉండే సూర్య అన్నని ఎలా కలవాలా అని ఆయన పెద్ద స్టార్, ఆయన కలవాలన్న కోరిక చాలా గట్టిగా ఉంది. 15 సంవత్సరాల తర్వాత సడన్ గా ఒక రోజు లైఫ్ లో ఈ రోజు నన్ను మీతో ఈ మూమెంట్ ని షేర్ చేసుకునేలా చేసింది’ అని విజయ్ తెలిపాడు. స్క్రీన్ మీద సూర్య అన్నని చూసిన ప్రతిసారి ఆయనలో ఉన్న యాక్టర్ ని నేను లవ్ చేస్తూనే ఉంటాను. సినిమాలు సంగతి  పక్కన పెడితే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎక్స్పరిమెంట్స్ ఫిలిం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా, అని విజయ్ తెలిపాడు.


ఫ్యాన్స్ కి  పండగె ..

కోలీవుడ్ స్టార్ సూర్య గత సంవత్సరం కంగువతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో ఆ సినిమా సక్సెస్ ని అందుకోలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా రెట్రో తో మన ముందుకు రానున్నారు. అందుకు తగినట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చి ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో కింగ్డమ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సగభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో విజయ్ పోలీస్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Intinti Ramayanam : ఇంటింటి రామాయణం సెట్ లో… ఇదేం కర్మరా రామచంద్రా..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×