BigTV English

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కొత్త రూట్స్, రాబోయే స్టేషన్లు ఇవే.. మీ ఏరియా ఉందేమో చూడండి!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కొత్త రూట్స్, రాబోయే స్టేషన్లు ఇవే.. మీ ఏరియా ఉందేమో చూడండి!

BIG TV LIVE Originals: హైదరాబాద్ ప్రజలకు మెట్రో సేవలు మరింతగా అందుబాటులోకి రాబోతున్నాయి. మెట్రో ఫేజ్ 2తో పాటు ఫేజ్ 3కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ఫేజ్ లలో నిర్మించే కారిడార్లు, స్టేషన్లు, కనెక్టివిటీకి సంబంధించి అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోను శంషాబాద్ విమానాశ్రయంతో పాటు నగరంలోని కీలక ప్రాంతాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫేజ్ 2 విస్తరణతో పాటు ఫేజ్ 3లో  కొన్ని ప్రతిపాదిత కారిడార్లు సహా మొత్తం సుమారు 116 కి.మీ కొత్త మెట్రో లైన్లను యాడ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఫేజ్ 2 పార్ట్ A కింద 54 కొత్త స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రవాణా నెట్‌వర్క్‌ను గణనీయంగా పెరగనున్నట్లు తెలిపారు. కొత్త కారిడార్లు, అవి కవర్ చేసే ప్రాంతాలు, ప్రతిపాదిత స్టేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..


ఫేజ్ 2 కారిడార్లు, కవర్ చేసే ప్రాంతాలు

ఫేజ్ 2 పార్ట్ A: ఈ ఫేజ్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా ప్రధాన నివాస, వాణిజ్య, రవాణా కేంద్రాలను అనుసంధానిస్తూ 76.4 కి.మీ విస్తీర్ణంలో  ఐదు కీలక కారిడార్లలో 54 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.


కారిడార్ IV: నాగోల్ నుంచి RGIA (36.6 కి.మీ, 24 స్టేషన్లు): ఈ కారిడార్ లో నాగోల్, LB నగర్, కర్మన్‌ ఘాట్,  చంద్రాయణగుట్ట, మైలార్‌ దేవ్‌ పల్లి, ఆరాంఘర్, కొత్త హైకోర్టు, శంషాబాద్, ఎయిర్ పోర్టు కవర్ అవుతాయి. ఇది ఫేజ్ 2లో  అతి పొడవైన కారిడార్. నాగోల్ నుంచి LB నగర్, చంద్రాయణగుట్ట ద్వారా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది. ఈ కారిడార్ లో 13 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. నాగోల్ స్టేషన్, నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని హాస్పిటల్, LB నగర్ జంక్షన్, సాగర్ రింగ్ రోడ్, మైత్రి నగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట్ రోడ్ జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, DRDO, హఫీజ్ బాబానగర్, చంద్రాయణగుట్టలో స్టేషన్లు నిర్మిస్తారు.

కారిడార్ V: రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ (11.6 కి.మీ., 8 స్టేషన్లు): ఈ కారిడార్ లో రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్‌ రామ్‌ గూడ, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ కారిడార్ రాయదుర్గం నుంచి కోకాపేట వరకు ఉన్న బ్లూ లైన్‌ను విస్తరించి, హైదరాబాద్‌లోని పెరుగుతున్న ఐటీ సెంటర్లకు కేంద్రాలకు సేవలు అందిస్తుంది. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ కారిడార్ లో బయోడైవర్సిటీ జంక్షన్,  నానక్‌ రామ్‌ గూడ జంక్షన్, నార్సింగి, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్, విమానాశ్రయ కార్గో లో స్టేషన్లను నిర్మించనున్నారు.

కారిడార్ VI: MGBS నుంచి చంద్రాయణగుట్ట (7.5 కి.మీ, 6 స్టేషన్లు): MGBS, దారుల్షిఫా, శాలిబండ, ఫలక్‌ నుమా, చంద్రాయణగుట్ట ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్, మెట్రో మౌలిక సదుపాయాలకు అనుగుణంగా రోడ్లు 100–120 అడుగులకు విస్తరించబడ్డాయి. ఈ కారిడార్ లో MGBS, దారుల్షిఫా జంక్షన్, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ జంక్షన్,  చంద్రాయణగుట్టలో స్టేషన్లను నిర్మించనున్నారు.

కారిడార్ VII: మియాపూర్ నుంచి పటాన్‌చెరు (13.4 కి.మీ, 10 స్టేషన్లు): మియాపూర్, అల్విన్ X రోడ్, మదీనాగూడ, చందా నగర్, BHEL, పటాన్‌చెరు కవర్ చేయబడుతాయి.  ఈ కారిడార్ మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు ముంబై హైవే వెంట రెడ్ లైన్‌ను విస్తరించనున్నారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. మదీనాగూడ సమీపంలో మెట్రో, రోడ్డు రవాణాను అనుసంధానించేలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను కలిగి ఉంటుంది. మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, మదీనగూడ, చందా నగర్, బిహెచ్ఇఎల్, ఆర్సి పురం, బీరంగూడ, జ్యోతి నగర్, ఇక్రిసాట్, పటాన్ చెరులో స్టేషన్లను నిర్మించనున్నారు.

కారిడార్ VIII: LB నగర్ నుంmr హయత్ నగర్ (7.1 కి.మీ, 6 స్టేషన్లు): LB నగర్, చింతల్ కుంట, వనస్థలిపురం, ఆటో నగర్, ఆర్‌టిసి కాలనీ, హయత్ నగర్ కవర్ అవుతాయి. ఈ కారిడార్ విజయవాడ హైవే వెంబడి LB నగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరిస్తారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. LB నగర్, చింతల్ కుంట, వనస్థలిపురం, ఆటో నగర్, ఆర్‌టిసి కాలనీ, హయత్ నగర్ లో స్టేషన్లను నిర్మించనున్నారు.

ఫేజ్ 2: పార్ట్ B: ఈ దశలో RGIAను ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీ అనుసంధానించే అదనపు కారిడార్ ఉంది. ఇది 9 స్టేషన్లతో 40 కి.మీ. విస్తరించి ఉంది. RGIA, మన్సాన్‌పల్లి రోడ్, ముచెర్ల కవర్ అవుతాయి.  ఇందులో విమానాశ్రయంలో 2 కి.మీ. భూగర్భ విభాగం, 18 కి.మీ. ఎట్ గ్రేడ్ (రోడ్-లెవల్) విభాగం, 20 కి.మీ. ఎలివేటెడ్ విభాగం ఉన్నాయి.

 ఫేజ్ 2 పార్ట్ B (ఉత్తర విస్తరణ): నార్త్ హైదరాబాద్‌కు మెట్రో సేవలను విస్తరించడానికి ఇటీవల ఈ కారిడార్ ను ఆమోదించారు. ఇది పారడైజ్ నుంచి మేడ్చల్ (23 కి.మీ) వరకు విస్తరించి ఉంటుంది. పారడైజ్, కొంపల్లి, మేడ్చల్ ప్రాంఆలు కవర్ అవుతాయి.  JBS నుంచి శామీర్‌పేట (22 కి.మీ): జూబ్లీ బస్ స్టేషన్, విక్రమ్‌ పురి, ఖార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట, తుమకుంట, శామీర్‌పేట, ORR ఎగ్జిట్ కవర్ అవుతాయి. జూబ్లీ బస్ స్టేషన్, విక్రమ్‌పురి, ఖార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట, తుమకుంట, షామీర్‌పేటలో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

ప్రతిపాదిత ఫేస్ III కారిడార్లు:  ఆగస్టు 2023లో తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన ఫేజ్ IIIలో ఎనిమిది రేడియల్ కారిడార్లు, 136 కి.మీ ఔటర్ రింగ్ రోడ్ (ORR) మెట్రో కారిడార్‌తో సహా 278 కి.మీ మెట్రో లైన్‌లను జోడించాలని నిర్ణయించింది.

BHEL నుండి పటాన్‌చెరు నుంచి ఇస్నాపూర్ (13 కి.మీ): ఫేజ్ II  పటాన్‌చెరు కారిడార్ దాటి పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుంది. LB నగర్ నుంచి హయత్‌నగర్ నుంచి పెద్దంబర్‌పేట (13 కి.మీ): ఫేజ్ II హయత్‌నగర్ కారిడార్‌ను మరింత విస్తరిస్తుంది. శంషాబాద్ జంక్షన్ నుండి కొత్తూర్ నుంచి షాద్‌నగర్ (28 కి.మీ): సౌత్ శివారు ప్రాంతాలను,  ఫార్మా సిటీని కలుపుతుంది.  ఉప్పల్ నుంచి బీబీనగర్ వయా ఘట్కేసర్ (25 కి.మీ): ఈస్ట్  హైదరాబాద్, వరంగల్ మార్గంలో సేవలు అందిస్తుంది. శంషాబాద్ నుంచి కందుకూర్ వయా తుక్కుగూడ ORR (26 కి.మీ): ఫార్మా సిటీకి అనుసంధానిస్తుంది. తార్నాక నుంచి ECIL X రోడ్ (8 కి.మీ): ఈశాన్య నివాస ప్రాంతాలకు సేవలందిస్తుంది.  ORR మెట్రో కారిడార్ (136 కి.మీ): శంషాబాద్‌ను పెద్ద అంబర్‌పేట్, మేడ్చల్, పటాన్‌చెరు, నార్సింగికి అనుసంధానించే 16 స్టేషన్లతో మొత్తం ఔటర్ రింగ్ రోడ్‌ను కవర్ చేస్తుంది. JBS నుంచి తుమకుంట (18.5 కి.మీ) మరియు పారడైజ్ నుంచి కండ్లకోయ వయా కొంపల్లి (18.5 కి.మీ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ కారణంగా రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమైన డబుల్ డెక్కర్ కారిడార్లు నిర్మించనున్నారు. .

మెట్రో నిర్మాణ ఖర్చుల వివరాలు

మొత్తం ఖర్చు (ఫేజ్ II పార్ట్ A): రూ. 24,269 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూర్చింది (రూ.7,313 కోట్లు, 30%), కేంద్ర ప్రభుత్వం (రూ4,230 కోట్లు, 18%) అందించింది. అంతర్జాతీయ రుణాలు (2%). ఫేజ్ 2 2030 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫేజ్ 2 ద్వారా రోజూ 8 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Related News

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

Big Stories

×