Vijay Devarakonda : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా రెట్రో. ఈ సినిమాను సూర్య చాలా కసితో తీసాడని మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఆయన గత చిత్రం కంగువ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈసారి తన అభిమానులు కాలర్ ఎగరేసే విధంగా ఈ సినిమాని నిర్మించాలని సూర్య గట్టిగా అనుకొని ఈ సినిమాని నిర్మించాడు. సినిమాలో హీరో గా చేయడంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ మీద నమ్మకంతో ఈ సినిమాను నిర్మించాడు కూడా తన 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో నాజర్, జయరాం, ప్రకాష్ రాజ్,వంటి సీనియర్ నటులు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ శనివారం సాయంత్రం హైదరాబాదులో జేఆర్ సి కన్వెన్షన్ లో ఈవెంట్ జరిగింది. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన పాకిస్తాన్ ఘటన పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వివరాలు చూద్దాం..
బూతులు తిట్టిన విజయ్ ..
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సూర్య రెట్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేశారు. ఈవెంట్లో సుమ విజయ్ దేవరకొండ ని ప్రశ్నలు వేస్తుంది. విజయ్ అన్నిటికీ సమాధానం చెప్తాడు. తర్వాత విజయ్ మాట్లాడుతూ.. నేను సూర్య అన్న మీద ప్రేమతో ఇక్కడికి వచ్చాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయన సినిమాల విషయం పక్కన పెడితే ఆయన యాక్టింగ్ అంటే నాకు చిన్నప్పటినుండి పిచ్చి. ఆయన గజినీ సినిమా మొదటిసారి నేను చూశాను. ఆ సినిమా చూసినప్పుడు ఆయన యాక్టింగ్ కి నేను ఫిదా అయిపోయి ఆయన చేసిన తదుపరి సినిమాలన్నీ చూశాను. నేను కొత్తగా సినిమాల్లోకి వచ్చే ముందు సూర్య అన్న సినిమాలు చూసి ఈయన ఇలా బాడీని ఎలా మెయింటైన్ చేస్తున్నాడా? ఇంత డిసిప్లిన్ గా ఎలా ఉంటున్నాడా అని ఆలోచించేవాడిని, ఆయనను కలవాలని ఎంతో తాపత్రయపడ్డాను. ఆయన ఉండేది చెన్నైలో నేను ఉండేది హైదరాబాదులో ఎలా కలవడం కుదురుతుందా అని అనుకునేవాన్ని, కానీ నా అదృష్టం 15 ఏళ్ల తర్వాత ఇలా మీ ముందుకి ఇద్దరం ఒకేసారి స్టేజి పంచుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈవెంట్ నాకు చాలా స్పెషల్. ఆయన అగరం ఫౌండేషన్ ద్వారా పిల్లలకు చదువు అందిస్తున్నారు అది ఎంతో గొప్ప విషయం. నేను మొదట్లో నా సినిమాలు ఆడినప్పుడు కొంత డబ్బు రాగానే ఎడ్యుకేషన్ కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను, కానీ ఇప్పటివరకు కుదరలేదు. చాలా సంవత్సరాల నుంచి సూర్య అన్న పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తున్నాడు అంటే చాలా గ్రేట్. చదువు ఎంతో ముఖ్యం అది మనకి సంస్కారం నేర్పిస్తుంది. ఇటీవల కాశ్మీర్ లో ఇలా జరుగుతున్నాయి కదా, వాళ్లకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక, ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఆ నా కొడుకులకి ప్రాపర్ గా ఎడ్యుకేషన్ ఇప్పించి, ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారు ఇలా చేయడం అని, నేర్పించాలి. నేను చెప్తున్నాను కదా కాశ్మీర్ ఇండియాదే, వాళ్లు ఇండియన్స్ నేను 2 ఇయర్స్ బ్యాక్ ఖుషి సినిమా షూటింగ్ కి అక్కడికి వెళ్ళినప్పుడు వారు బాగ రిసీవ్ చేసుకున్నారు. వాళ్లతో నాకు మంచి మెమరీస్ ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషుల్ని చూసుకోలేక, అక్కడ కరెంటు కూడా లేదు. నీళ్లు లేవు ఇక్కడికి వచ్చి ఏం చేయాలని చూస్తున్నారో, ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ వాళ్లకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్లే అటాక్ చేసే రోజు వస్తుంది. ఇలానే కంటిన్యూ అయితే కచ్చితంగా జరుగుతుంది అని,ఆ నా కొడుకులకు బుద్ధి లేక అంటూ, విజయ్ కాశ్మీర్ ఆక్టివ్ పై రియాక్ట్ అయ్యారు. ఈ వీడియో చూసిన వారంతా విజయ్ దేవరకొండ రౌడీ బాయ్ అని మరోసారి అనిపించాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
బ్లాక్ బాస్టర్ రికార్డు..
ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ నిర్మాత సూర్యదేవరనాగ వంశీ వెంకీ అట్లూరి, కార్తికేయన్, కాసర్ల శ్యామ్ కరుణాకరన్ ప్రముఖులు విచ్చేశారు. ఈ సినిమా సంగీతం సంతోష్ నారాయన్ అందించారు. తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మే1న రిలీజ్ కాబోతుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్,పోస్టర్ తో సూర్య అభిమానుల లో అంచనాలను పెంచేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక,ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Sonali: మెగాస్టార్ హీరోయిన్ బుక్ రాసేసిందిరోయ్.. అదే స్పెషాలిటీ