Vijay Devarakonda : మహా కుంభమేళా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. భారతదేశంలోని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, ప్రయాగ్ రాజ్ జిల్లాలో, గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది. ఇది 144 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతి పెద్ద కుంభమేళా కావడంతో దీనిని మహా కుంభమేళా అని నామకరణం చేశారు. ఈ కుంభమేళ 45 రోజుల పాటు జరుగుతుంది. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహా కుంభమేళా 2025 పుష్య మాసం పౌర్ణమి తిథినాడు అనగా 2025 జనవరి 13న ప్రారంభించారు.2025 ఫిబ్రవరి 26 వరకు అనగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముగుస్తుంది. ఈ మహా కుంభమేళా సుమారు నాలుగు మిలియన్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ మొదలగు నాలుగు ప్రదేశాలలో 12 ఏళ్ళకు ఒకసారి నిర్వహించే హిందూ ఆచార వ్యవహారాలను కార్యక్రమము.
ఈ కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు హాజరైన విషయం తెలిసిందే. కేవలం భక్తులు మాత్రమే కాకుండా చాలామంది సినిమా ప్రముఖులు, రాజకీయ వ్యక్తులు కూడా హాజరవుతూ ఉంటారు. ఇక తాజాగా తెలుగు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కుంభమేళాకు హాజరైనట్లు తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అంతేకాకుండా కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసుకున్నాడు. మన మూలాలను గౌరవిస్తూ, ఇండియన్ బాయ్స్ తో చాలా జ్ఞాపకాలను పోగు చేసుకుంటూ, మా అమ్మతో ప్రార్థన చేస్తున్నాను అంటూ ఫొటోస్ ను షేర్ చేసాడు. తన డార్లింగ్ గ్యాంగ్ తో కాశీకి వెళ్లినట్లు ఆ పోస్ట్ లో తెలిపాడు. విజయ్ అప్లోడ్ చేసిన పోస్టులో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపిస్తున్నారు. ఇక మహా కుంభమేళాలో విజయ్ లుక్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది.
విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ (సామ్రాజ్యం) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా గౌతమ్ లో ఇటువంటి యాంగిల్ కూడా ఉందా అని అనిపించేలా ఉంది ఆ వీడియో. ఎవరు ఊహించని రేంజ్ లో దానిని గౌతమ్ డిజైన్ చేశారు. ఈ సినిమాను 2 పార్ట్స్ లో విడుదల చేయనున్నారు. వరుస డిజాస్టర్ మీద ఉన్న విజయ్ కి ఇకపై వరుస సక్సెస్ సినిమాలు పడతాయి అని చెప్పొచ్చు. దీనికి కారణం యంగ్ డైరెక్టర్స్ అందరితో కూడా విజయ్ ప్రాజెక్ట్స్ చేయడం. సినిమాలో విజయ్ దేవరకొండ ఇదివరకు ఎన్నడు కనిపించిన విధంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే లుక్ లో కుంభమేళాలో కూడా దర్శనమిచ్చాడు విజయ్. ఏదేమైనా మన మూలాలను ఇలా గుర్తుచేసుకొని మన సంస్కృతికి అద్దం పట్టడం అనేది హర్షించదగ్గ విషయమని చెప్పొచ్చు.
The 2025 Kumbhmela – A journey to connect, pay respect to our epic origins and roots ❤️
Making memories With my Indian boys 🙂
Saying Prayers with mummy dearest.
A trip to Kasi with this darling gang. pic.twitter.com/m4uMcsYH1v
— Vijay Deverakonda (@TheDeverakonda) February 17, 2025