Prabhas : ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో హోంబలే సంస్థ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన సినిమా ‘సలార్:సీజ్ ఫైర్’.. ప్రభాస్ (Prabhas)ని అభిమానులు ఎలాంటి పాత్రలో అయితే చూడాలి అనుకుంటున్నారో ప్రశాంత్ నీల్ అలాంటి పాత్రలోనే ప్రభాస్ ని.. సలార్ మూవీలో చూపించారు.దీంతో సలార్ మూవీలో ప్రభాస్ యాక్షన్ మాస్ యాంగిల్ ని చూసి ఆయన అభిమానులైతే ఫుల్ మీల్స్ దొరికినంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ సినిమా ఒక్కసారి చూస్తే అర్థం కాదని,రెండు మూడు సార్లు చూసిన సరే బోర్ కొట్టకుండా మళ్లీ ఏం జరుగుతుంది అనే ఎక్జైట్మెంట్ ఉంటుంది అని ఇప్పటికే ఈ సినిమా చూసిన ఎంతోమంది రివ్యూలు ఇచ్చారు. అయితే అలాంటి సలార్ (Salaar) మూవీ 2023 డిసెంబర్ 22న విడుదలై ఇయర్ ఎండింగ్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. అలా దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ మూవీ రూ.700 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న ప్రభాస్ కి.. సలార్ మూవీ ఒక మంచి హిట్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు.
ఓటీటీలో సరికొత్త రికార్డు..
ఇక ఈ సినిమా చివర్లో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంది అని చెప్పారు. అలా సలార్ -2 సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. అయితే అలాంటి సలార్ మూవీ ఓటిటిలో సరికొత్త రికార్డు సృష్టించింది. మరి ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. థియేటర్లలో విడుదల కాకముందే ఓటిటి రైట్స్ కూడా కొనుగోలు చేస్తారు. అలా థియేటర్లో విడుదలయ్యాక ఒకటి రెండు నెలల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తారు. అలా విడుదలైన సలార్ మూవీ మాత్రం ఓటిటిలో ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. అదేంటంటే 366 రోజులపాటు ఈ సినిమా నిర్ణయంతరాయంగా స్ట్రీమింగ్ అయి ఒక సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది. జియో హాట్ స్టార్ లో సలార్ మూవీ 366 రోజులు నిరంతరాయంగా స్ట్రీమింగ్ అవ్వడంతో దీని గురించి స్పందిస్తూ ప్రభాస్ చాలా ఆనందపడ్డారు.. “ఖన్సార్ సిటీలో అడుగు పెట్టడానికి ఇంకా వేచి ఉండలేను” అంటూ సలార్-2 (Salaar-2) గురించి కూడా మంచి అప్డేట్ ఇచ్చారు. ఇక ప్రభాస్ స్పందించడంతో చాలామందిలో సలార్ 2 పై మరింత హైప్ పెరిగింది. ఇక ఓటిటిలో రికార్డ్ సృష్టించిన సలార్ మూవీ గురించి హోంబలే సంస్థ వాళ్ళు కూడా స్పందించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇప్పటికి కూడా ఓటీటిలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాలలో సలార్ సినిమా టాప్ 10 ప్లేస్ లో ఉండడంతో ప్రభాస్ రేంజ్ ఏంటో మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటూ సోషల్ మీడియాలో సలార్ ఓటీటీ లో సాధించిన రికార్డు గురించి పోస్టులు చేస్తున్నారు.
ప్రభాస్ సినిమాలు..
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ది రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.ఇక ఈ ఏడాది చివర్లో స్పిరిట్ మూవీ (Spirit Movie)లో భాగమవుతారని తెలుస్తోంది. సలార్ -2 సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది ప్రశాంత్ నీల్ జూ.ఎన్టీఆర్ తో సినిమా షూటింగ్లో బిజీగా ఉంటారు. కాబట్టి వచ్చే ఏడాది సలార్ -2 షూటింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.