Coconut Oil: కొబ్బరినూనె జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు చాలా మంచిది అయినప్పటికీ, చలికాలం విషయానికి వస్తే, కొబ్బరి నూనె మీ జుట్టుకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది. కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలియజేయడమే కాకుండా జుట్టుకు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో జుట్టుకు కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
వింటర్ సీజన్ గురించి మాట్లాడినట్లయితే, ఇది జుట్టుకు చాలా ఛాలెంజింగ్ సీజన్. చలి కాలంలో జుట్టుకు అదనపు జాగ్రత్త అవసరం. కొబ్బరి నూనె జుట్టుకు మంచి ఎంపిక. చలికాలంలో కొబ్బరినూనె రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
జుట్టుకు బలాన్ని ఇస్తుంది: కొబ్బరి నూనె జుట్టుకు చాలా పోషణను అందిస్తుంది. దీని వల్ల మీ జుట్టు కూడా చాలా దృఢంగా మారుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ , యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకలను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది: కొబ్బరి నూనె మీ జుట్టును తేమగా చేస్తుంది. శీతాకాలంలో జుట్టును తేమగా ఉంచడం చాలా ముఖ్యం. కొబ్బరి నూనె జుట్టుకు తేమను అందించడంతో పాటు పొడిబారకుండా చేస్తుంది. తరుచుగా కొబ్బరి నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. ఫలితంగా జుట్టు మృదువుగా కూడా ఉంటుంది.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది: కొబ్బరి నూనె జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టును బలోపేతం చేస్తాయి. ఇది మీ జుట్టు రాలడాన్ని ఆపుతుంది. కొబ్బరి నూనె మసాజ్ మీ జుట్టు రాలకుండా చేస్తుంది.
కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల కలిగే నష్టాలు:
జుట్టును జిగటగా మార్చుతుంది: కొబ్బరి నూనె శీతాకాలంలో మీ మందపాటి పొడవాటి జుట్టును జిగటగా మార్చుతుంది. జిగట కారణంగా, జుట్టుపై చుండ్రు ప్రమాదం పెరుగుతుంది. అందుకే జాగ్రత్తగా వాడాలి.
జుట్టును హెవీగా మార్చగలదు: కొబ్బరి నూనె జుట్టును హెవీగా మార్చగలదు. అందుకే ఇది తక్కువ పరిమాణంలో వాడాలి. కొబ్బరి నూనెను అధిక మొత్తంలో అప్లై చేయడం వల్ల తరచుగా తలనొప్పి సమస్యను కలిగిస్తుంది. అందుకే తగిన మోతాదులోనే జుట్టుకు ఆయిల్ అప్లై చేయాలి. జుట్టుకు అధికంగా ఆయిల్ అప్లై చేసినా కూడా జుట్టు జిడ్డుగా మారుతుంది.
Also Read: జుట్టు బాగా పెరగాలంటే.. ఇలా చేయండి చాలు
అలెర్జీలకు కారణం కావచ్చు: కొబ్బరినూనె కొందరిలో అలర్జీని కలిగిస్తుంది.అందుకే దానిని ఉపయోగించే ముందుచిన్న భాగంలో పరీక్షించాలి. చాలా మంది చర్మం కొబ్బరి నూనె అప్లై చేయడం ఇష్టం ఉండదు. అందుకే కొందరు జట్టుకు కొబ్బరినూనె జుట్టుకు అప్లై చేయకుండా ఉంటారు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.