BigTV English

Turmeric For Skin: పసుపుతో ఇలా చేస్తే.. మెరిసే చర్మ సౌందర్యం మీ సొంతం..

Turmeric For Skin: పసుపుతో ఇలా చేస్తే.. మెరిసే చర్మ సౌందర్యం మీ సొంతం..

Turmeric For Skin: ముఖం తెల్లగా, మచ్చలు, మొటిమలు లేకుండా ఉండాలని.. ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వయసులోనే పెద్దవారిలాగా కనిపించడం, అలాగే ముఖంపై ముడతలు రావడం వంటివి వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తినే ఫుడ్‌లో మార్పులు, ఆఫీస్, ఇంట్లో స్ట్రెస్, దుమ్మూ, కాలుష్యం మొదలైనవి. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం సూన్యం.


కాబట్టి ఎక్కువ ధరలు చెల్లించి ఫేస్ ప్యాక్ ప్యాక్‌లు, స్కబ్బర్లు వాడటంకంటే.. సహజ సిద్ధంగా లభించే పసుపును వాడటం మంచిదని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపు వాడకం వల్లన మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్లు వంటి సమస్యలు తొలగిపోతాయి. పసుపులో వీటిని కలిపి ముఖానికి పెట్టుకున్నారంటే.. మెరిసే చర్మం మీ సొంతం చేసుకోవచ్చని.. సౌందర్య నిపుణులు అంటున్నారు. మరి ఆలస్యం చెయ్యకుండా.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు, నిమ్మరసం ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గిపోయి యవ్వనంగా కనిపిస్తారు.


పసుపు, శెనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ శెనగపిండి, టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి అప్లై చేసి పావుగంట తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై నలుపుదనాన్ని తొలగించి.. కాంతివంతంగా మెరుస్తుంది.

పసుపు, పచ్చిపాలు ఫేస్ ప్యాక్
ఒక గిన్నె తీసుకుని అందులో.. రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు, టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.. ముఖంపై మృత కణాలు, మురికి తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.

పసుపు, బియ్యంపిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి, టీ స్పూన్ పసుపు, రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. మఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది. నిత్యం తాజాగా కనిపిస్తుంది.

Also Read: ఈ చిన్న చిట్కాతో మీ కిడ్నీ సమస్యలను కనిపెట్టేయొచ్చు, టెస్టులు అవసరం లేదు!

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×