Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పేరుకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి కొద్దీ నెలల్లోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ఈ మధ్య సరైన హిట్ టాక్ ను అందుకోలేక పోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అది యావరేజ్ టాక్ ను అందుకొని విజయ్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. ఆ తర్వాత కల్కి మూవీలో గెస్ట్ రోల్ చేసి అందరిని మెప్పించాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేసి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక రష్మిక మందన్న తో రిలేషన్లో ఉన్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దానికి ఇద్దరు సమాధానం చెప్పట్లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.. విజయ్ ఏం చెప్పాడంటే..?
రష్మిక మందన్నతో రిలేషన్ పై క్లారిటీ..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో రష్మిక తో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందని అక్కడ అడగ్గా.. విజయ్ దానికి సమాధానం చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. దీనిపై నేను సమయం వచ్చినప్పుడు స్పందిస్తాను. ప్రపంచం మొత్తం దీనిపై మాట్లాడుకున్నప్పుడు నేను అసలు విషయాన్ని బయటపెడతాను. ఏదానికైనా ఒక సమయం సందర్బం ఉంటుంది. నేను ఒక సెలెబ్రేటిని నా గురించి అందరికి తెలుసుకోవాలని ఉంటుంది. తప్పులేదు. కానీ నేను దీనిపై త్వరలోనే క్లారిటి ఇస్తాను అని ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసాడు రౌడీ హీరో . ప్రస్తుతం ఆయన సినిమాల పై మాత్రమే ఫోకస్ చేసినట్లు చెప్పాడు. అటు రష్మిక మందన్నకు కూడా ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆమె కూడా ఏదో అన్నట్లు చెప్పి తప్పించుకుంటుంది. ప్రస్తుతం వచ్చే ఏడాది వరకు ఇద్దరు బిజీగా సినిమాలను చేస్తున్నారు. 2026 లో గుడ్ న్యూస్ చెప్తారేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. గతంలో విజయ్ నటించిన సినిమాలు యువతలో అతనికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో, భాగ్య శ్రీ బోర్స్ ను హీరోయిన్ గా కనిపించనుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.. ఇక 2025 మార్చి 28, విడుదలకు ప్లాన్ చేసిన ఈ చిత్రం, భారీ పోటీ ఉండనున్న ఏడాదిలో తనదైన గుర్తింపును సాధించబోతున్నట్లు కనిపిస్తోంది.. ఆ తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.
రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. బాలీవుడ్ లో సికిందర్ మూవీ చేస్తుంది. తెలుగులో కుబేర తోపాటుగా మరో రెండు సినిమాలు చేస్తుంది. అలాగే తమిళంలో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంది. అలాగే పుష్ప 3 మూవీలో కూడా నటిస్తుంది.