Walking: నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అందుకే రోజు కనీసం 3-4 కిలోమీటర్లు నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం వంటి వ్యాధులను అదుపులో ఉంచుకోవడానికి నడక కూడా చక్కని వ్యాయామం. మీరు ఒత్తిడితో పోరాడుతున్నట్లయితే, దానిని తగ్గించడంలో నడక మీకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
మంచి నడక కూడా నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వ్యాయామం పేరుతో వాకింగ్ మాత్రమే చేసినా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతి రోజు నడవడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
బరువు తగ్గడానికి: క్రమం తప్పకుండా నడవడం ద్వారా శరీరంలోని కేలరీలు బర్న్ అవుతాయి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు నడవడం వల్ల అదనపు కేలరీలను తగ్గించుకోవచ్చు. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.
గుండె ఆరోగ్యానికి మంచిది: నడక హృదయ స్పందన రేటును పెంచుతుంది. అంతే కాకుండా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఇది అధిక రక్తపోటు, గుండెపోటు ,స్ట్రోక్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
దృఢమైన ఎముకలు: నడక ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే తప్పకుండా ప్రతి రోజు నడవడం అలవాటు చేసుకోవాలి.
ఒత్తిడిని తగ్గించండి: ఒత్తిడిని తగ్గించుకోవడానికి నడక ఒక ప్రభావవంతమైన మార్గం. ఇది ఎండార్ఫిన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఫలితంగా ఇది మిమ్మల్ని సంతోషంగా,రిలాక్స్‌గా చేస్తుంది.
మంచి నిద్ర: రెగ్యులర్ వాకింగ్ మీకు రాత్రి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అంతే కాకువండా రోజంతా మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది.
మెదడును పదునుగా ఉంచుతుంది: నడక మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జ్ఞాపకశక్తి , ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Also Read: ఈ ఆయిల్ ఒక్క సారి వాడినా చాలు.. జుట్టు ఒత్తుగా పెరగడం గ్యారంటీ
మీరు ప్రతిరోజు ఎంతసేపు నడవాలి ?
మీరు ప్రతిరోజు కనీసం 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు చురుకైన వేగంతో నడవాలి. రోజుకు రెండుసార్లు 20-20 నిమిషాలు కూడా నడవవచ్చు.
ఏ సమయంలోవాకింగ్ చేయాలి ?
మీరు రోజులో ఎప్పుడైనా వాకింగ్ కి వెళ్లొచ్చు. నడవడానికి ఉదయం, సమయం సమయం బెటర్.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.