Keerthy Suresh: సినీ సెలబ్రిటీలు ఏం చేసినా దానిపై కొందరు ప్రేక్షకులు చాలా ఫోకస్ పెడతారు. అందుకే చాలాసార్లు చిన్న చిన్న విషయాలకే వారు ట్రోల్ అవుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే ఇలాంటి ట్రోల్స్ తరచుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెళ్లయిన హీరోయిన్ల విషయంలో నెటిజన్లు మరీ నెగిటివిటీ చూపిస్తుంటారు. తాజాగా తను ప్రేమించిన వ్యక్తిని గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని తిరిగొచ్చింది కీర్తి సురేశ్. కొత్తగా పెళ్లయిన కీర్తి సురేశ్‌పై అప్పుడే ట్రోల్స్ మొదలయ్యాయి. ఒకవైపు పెళ్లి, మరోవైపు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కీర్తి సురేశ్.. తన డ్రెస్సింగ్ స్టైల్ వల్ల ట్రోల్ అవుతోంది. ప్రస్తుతం చాలామంది నెటిజన్లు కీర్తి సురేశ్ డ్రెస్సింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఏంటా బట్టలు.?
డిసెంబర్ 12న కీర్తి సురేశ్.. తను ప్రేమించి ఆంటోని తట్టిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గోవాలో వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇదే సమయంలో కీర్తి బాలీవుడ్ డెబ్యూ మూవీ అయిన ‘బేబి జాన్’ విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే మూవీ ప్రమోషన్స్‌లో తను కూడా పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ‘బేబి జాన్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న తర్వాతే గోవాకు పెళ్లికి బయల్దేరింది కీర్తి. పెళ్లయ్యి తిరిగొచ్చిన వెంటనే మళ్లీ ప్రమోషన్స్‌తోనే బిజీ అయిపోయింది. పెళ్లి అయిపోయింది కాబట్టి వెంటనే మంగళసూత్రంలో కనిపించి అందరితో ప్రశంసలు అందుకున్న కీర్తి.. తన డ్రెస్సింగ్ విషయంలో మాత్రం ట్రోల్స్ ఎదుర్కుంటోంది.
Also Read: రికార్డ్ బ్రేకింగ్ డైరెక్టర్‌తో నయనతార సినిమా.. మళ్లీ ఫామ్‌లోకి రానుందా.?
మోడర్న్ డ్రెస్సులో మంగళసూత్రం
ఇటీవల గోవా నుండి తిరిగి చెన్నైకు వచ్చేసింది కీర్తి సురేశ్ (Keerthy Suresh). వెంటనే ‘బేబి జాన్’ (Baby John) ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి ఎక్కువగా మోడర్న్ డ్రెస్సుల్లో కనిపిస్తోంది. ఒకరోజు స్లిట్ కట్ ఫ్రాక్‌లో కనిపించిన కీర్తి.. ఆ మరుసటి రోజు రెడ్ కలర్ ఫ్రాక్‌లో కనిపించింది. ఆ మోడర్న్ డ్రెస్సులతో పాటు తన మెడలో మంగళసూత్రం కూడా ఉంది. ఒకప్పుడు నయనతార కూడా పెళ్లయిన వెంటనే ఇలాగే మోడర్న్ డ్రెస్, మంగళసూత్రంతో కనిపించి ట్రోల్ అయ్యింది. ఇప్పుడు కీర్తి సురేశ్ కూడా అవే ట్రోల్స్ ఎదుర్కుంటోంది. మంగళసూత్రం వేసుకున్నప్పుడు చీరకట్టులో ఉండుంటే బాగుండేదని కీర్తికి చాలామంది సలహాలు ఇస్తున్నారు.
సూపర్ ఎండింగ్
కీర్తి సురేశ్‌కు ఇటీవలే పెళ్లయ్యింది కాబట్టి మంగళసూత్రంలో కనిపించడం కరెక్టే కానీ అదేదో చీరకట్టులో మంగళసూత్రంతో కనిపించి ఉంటే లక్షణంగా ఉండేదని, అలా కాకుండా మోడర్న్ డ్రెస్‌పై మంగళసూత్రం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే కీర్తికి సౌత్‌లో మంచి గుర్తింపు ఉంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి సమయంలో వరుణ్ ధావన్‌తో నటించిన ‘బేబి జాన్’ అనే మూవీతో బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాదిని ‘బేబి జాన్’ రిలీజ్, తన పెళ్లితో సూపర్ డూపర్‌గా ఎండ్ చేసింది కీర్తి సురేశ్. తన పెళ్లికి చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
Keerthy Suresh with Mangal Sutra📿 pic.twitter.com/DGH5s8iQin
— Manobala Vijayabalan (@ManobalaV) December 18, 2024