BigTV English

VD12: రౌడీబాయ్ విజయ్ డబుల్ డోస్.. పెద్ద ప్లాన్‌తోనే వస్తున్నాడుగా..

VD12: రౌడీబాయ్ విజయ్ డబుల్ డోస్.. పెద్ద ప్లాన్‌తోనే వస్తున్నాడుగా..

VD12 Update: రౌడీబాయ్ విజయ్ దేవరకొండ.. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడు. ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో హీరోగా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీశాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత ‘గీతా గోవిందం’ చేసి తన కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు.


ఇలా వరుస సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టి స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. అయిత గత కొంతకాలంగా అతడికి అదృష్టం కలిసి రావడం లేదనే చెప్పాలి. చేసిన ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా ఫ్లాప్ అవుతున్నాయి. గతంలో లైగర్ సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎవరూ ఊహించని టాక్‌తో ఫ్లాప్ అయింది. విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఖుషి మూవీ చేశాడు. ఇది కూడా పెద్ద హిట్ తెచ్చిపెట్టలేదు.

ఇక మొన్నటికి మొన్ననే ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేశాడు. ‘గీతా గోవిందం’తో మంచి హిట్ అందించిన దర్శకుడు పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా హిట్ టాక్ అందుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైన ఒక మంచి హిట్ కొట్టాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు.


Also Read: ‘విడి12’ కొత్త పోస్టర్.. విజయ్ దేవరకొండ ఏమున్నాడురా బాబోయ్

సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇందులో ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా రీసెంట్‌గా ఈ మూవీ నుంచి విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఖైదీ గెటప్‌లో గడ్డంతో తడుస్తూ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది.

ఇందులో విజయ్ దేవరకొండ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకటి పోలీస్ ఆఫీసర్‌గా.. మరొకటి ఖైదీగా కంప్లీట్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న దేవరకొండ ఖైదీగా ఎందుకు మారాడు అనేది కథలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని హైవోల్టేజీ యాక్షన్ సీక్వెన్స్‌గా తెరకెక్కిస్తున్నాడు. విజయ్ కెరీర్‌లో ఈ సినిమా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్‌లు రాబోతున్నాయి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×