BigTV English

Royal Enfield New Classic 350: క్లాసిక్ 350 అప్‌‌డేట్ వెర్షన్‌.. ఆగస్టు 12న లాంచ్.. లుక్ అదిరింది!

Royal Enfield New Classic 350: క్లాసిక్ 350 అప్‌‌డేట్ వెర్షన్‌.. ఆగస్టు 12న లాంచ్.. లుక్ అదిరింది!

Royal Enfield New Classic 350: భారతీయ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ రాబోయే రోజుల్లో దాని అత్యంత ప్రజాదరణ పొందిన బెస్ట్ సెల్లింగ్ బైక్ క్లాసిక్ 350 అప్‌‌డేట్ వెర్షన్‌ను విడుదల చేయబోతోంది. నివేదిక ప్రకారం కంపెనీ కొత్త క్లాసిక్ 350ని ఆగస్టు 12న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దాని మిడ్-లైఫ్ రివిజన్‌లో భాగంగా అప్‌డేట్ చేయబడిన క్లాసిక్ 350లో అనేక కాస్మెటిక్ ఛేంజస్‌తో రానుంది. అయితే టెక్నికల్‌గా ఇది అవుట్‌గోయింగ్ మోడల్‌గా ఉంటుంది. ఈ అప్‌డేట్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అందుబాటులో ఉన్న ఫీచర్‌లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.


రాయల్ ఎన్‌ఫీల్డ్ అప్‌డేట్ చేయబడిన క్లాసిక్ 350 హెరిటేజ్ డిజైన్ విషయానికి వస్తే హెరిటేజ్ ప్రీమియం, సిగ్నల్స్, డార్క్, క్లాసిక్ క్రోమ్ మొత్తం 5 వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. బేస్ వేరియంట్ వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్‌తో మాత్రమే ఉండొచ్చు. ట్యూబ్‌లెస్ రబ్బర్‌పై అల్లాయ్ వీల్స్ ఉన్న ఏకైక గ్రేడ్ డార్క్.

Also Read: Hyundai Grand i10 Nios: రికార్డ్ క్రియేట్ చేసిన గ్రాండ్ ఐ10 నియోస్.. 4 లక్షల ఇళ్లకు చేరుకుంది!


అయితే మిగతా 4 వేరియంట్లలో అల్లాయ్ వీల్స్ ఆప్షన్ ఉండదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఫేస్‌లిఫ్ట్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, ఎల్‌ఈడీల, సిగ్నేచర్ పైలట్ ల్యాంప్‌లు ఉంటాయి. కాబట్టి ఎల్‌ఈడీ లైటింగ్‌ను కలిగి ఉంటుంది.

మరోవైపు బైక్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. అడ్జస్ట్‌మెంట్ చేయగల క్లచ్, బ్రేక్ లివర్ టాప్-స్పెక్ డార్క్, క్లాసిక్ క్రోమ్‌లలో స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటాయి.  అయితే ఇవి ఇతర వేరియంట్‌లలో ఆప్షనల్‌గా ఉంటాయి. అదనంగా గేర్ పొజిషన్ ఇండికేటర్. USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ స్టాండర్డ్‌గా ఉంటాయి.

ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఫేస్‌లిఫ్ట్ 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20బిహెచ్‌పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27ఎన్ఎమ్ పీక్ టార్క్ రిలీజ్ చేయగల 349సిసి ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. బైక్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లింకై ఉంటుంది. ప్రస్తుతం  క్లాసిక్ 350 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.93 లక్షల నుండి రూ. 1.99 లక్షల వరకు ఉంటుంది.

Also Read: Bajaj Freedom 125 CNG: CNG నెగిటివ్ పాయింట్స్.. తెలుసుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు!

కంపెనీ నుండి అల్లాయ్ వీల్స్‌తో వచ్చే లైనప్‌కి రాయల్ ఎన్‌ఫీల్డ్ మరిన్ని వేరియంట్‌లను యాడ్ చేయనుంది. ప్రస్తుతానికి, డార్క్ స్టెల్త్ బ్లాక్ అనే ఒకే ఒక వేరియంట్ మాత్రమే స్టాండర్డ్‌గా అల్లాయ్ వీల్స్‌తో వస్తున్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లు రైడింగ్ చేసేటప్పుడు సేఫ్టీ ఫీల్ అందిస్తాయి. ఎందుకంటే రైడర్ పంక్చర్ కిట్‌ని తీసుకెళ్తుంటే ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన పంక్చర్‌ను సులభంగా సెట్ చేయవచ్చు.

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×