Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తాడనుకున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ టాక్‌ను అందుకున్నాడు. ఈ మూవీతో అయినా తన కెరీర్‌లో మళ్లీ టాప్ పొజీషన్‌లోకి వెళ్లాలనుకున్న అతడి కోరిక నీరుగారింది. సినిమా రిలీజ్‌కు ముందు టీజర్, సాంగ్స్, ట్రైలర్‌తో భారీ బజ్ క్రియేట్ అయింది. కానీ బొమ్మ రిలీజ్ అయ్యాక మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలం అయింది.
యూత్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. రొటీన్ కాన్సెప్టుతో, సీరియల్‌లా ఈ మూవీ ఉందని కొందరు సినీ ప్రియులు ఆ మధ్య కామెంట్ల వర్షం కురిపించారు. దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో విజయ్ పట్టుబట్టి ఉన్నాడు.
ఇందులో భాగంగానే వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఓ పీరియాడికల్ మూవీ చేయబోతున్నాడు. రీసెంట్‌గా విజయ్ బర్త్ డే రోజున ఈ మూవీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తుంటే.. ఈ సారి విజయ్ డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడని అర్థం అయింది. 1854 – 1878 మధ్య కాలంలో ఓ యుద్ద వీరుడి జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: చారిత్రాత్మక కథతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. పోస్టర్ వచ్చేసింది!
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎంతో గ్రాండ్‌గా రూపొందబోతున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తండ్రీ కొడుకులుగా డబుల్ యాక్షన్ చేయనున్నాడని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అందులో ఒక పాత్ర సైనికుడిగా అని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే.. విజయ్ కెరీర్‌లో ఇదే మొదటి సారి డబుల్ రోల్ చేసినట్లు అవుతుంది.
ఇకపోతే ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే విజయ్ తన లైనప్‌లో మరో రెండు సినిమాలను ఉంచాడు. అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ విజయ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే మరొకటి ‘రాజా వారు రాణీ గారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ మూవీనీ ఇటీవలే అనౌన్స్ చేశారు. త్వరలో విజయ్ చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.