BigTV English

Prabhas Fauji: ఈ భారీ బడ్జెట్ ప్రభాస్ కోసమా.? కథ మీద నమ్మకమా.?

Prabhas Fauji: ఈ భారీ బడ్జెట్ ప్రభాస్ కోసమా.? కథ మీద నమ్మకమా.?

Prabhas Fauji: కొన్ని సందర్భాలలో కొన్ని సినిమాలు ఆ హీరోల కెరియర్ కు ఎంత బాగా ప్లస్ అవుతాయో అదేవిధంగా మైనస్ కూడా అవుతాయి. కానీ ఆ మైనస్ ఎవరు ఊహించలేరు. ఇక ప్రభాస్ కెరియర్ విషయానికి వస్తే బాహుబలి సినిమాకి ముందు బాహుబలి సినిమా తర్వాత అని చెప్పాలి. తెలుగు సినిమా స్థాయిని ప్రభాస్ కెరియర్ ను శిఖరం మీద కూర్చోబెట్టిన సినిమా బాహుబలి. బాహుబలి సినిమా తర్వాతే తెలుగు సినిమా పరిశ్రమకు ఒక అరుదైన గౌరవం లభించింది. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూసే ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే చేశాడు. దీనివలన ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని ప్రభాస్ అభిమానులంతా మిస్ అయిపోయారు.


అన్ని పాన్ ఇండియా

బాహుబలి సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా సాహు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. కానీ నార్త్ లో ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. సుజిత్ టెక్నికల్ గా ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా రాధే శ్యామ్. ఒక ఎపిక్ లవ్ స్టోరీ అంటూ రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఆదిపురుష్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పాలి. ఈ తరుణంలో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ అభిమానులకు మంచి ట్రీట్ లా అనిపించింది. ఇక మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి.


మునుపెన్నడూ లేని భారీ బడ్జెట్

ఇక ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ అనే ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. దీని గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయిస్తుంది. దాదాపుగా 600 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా రెండు పార్ట్ లు కూడా ఇంత ఖర్చు పెట్టలేదు. కల్కి సినిమాతో ప్రభాస్ 1,000 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో ప్రభాస్ మీద ఉన్న భరోసాతో అంత ఖర్చు పెడుతున్నారా.? లేకుంటే హను రాఘవపూడి రాసుకున్న కథకు అంత వర్త్ ఉందా అనేది అర్థం కాని విషయం. ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ మునుపెన్నడు ఏ సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టలేదు. ఇక ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో త్వరలో తెలియాల్సి ఉంది.

Also Read : Megastar Chiranjeevi: ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×