Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ.. ఆ తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ పోషించి , భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. ఈ సినిమా తర్వాత ద్వారక, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ అంటూ పలు చిత్రాలు చేశారు కానీ గీతా గోవిందం ఇచ్చిన సక్సెస్ ఇప్పటివరకు ఆ రేంజ్ లో సక్సెస్ లభించలేదని చెప్పాలి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అదే ‘కింగ్ డమ్’. ఇదిలా ఉండగా తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై విజయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బయటి వారే హిందీ పరిశ్రమను నిలబెడతారు – విజయ్ దేవరకొండ
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..”దక్షిణాది సినీ పరిశ్రమ ఇప్పుడు ఉన్నత స్థాయిలో పేరు తెచ్చుకుంటుంది. ఇప్పుడైతే ఈ చిత్ర పరిశ్రమకు దేశ విదేశాలలో కూడా గుర్తింపు ఉంది. ప్రేక్షకులు కూడా ఇప్పుడు సౌత్ సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకానొక సమయంలో ఇక్కడి సినిమాలకు ఏమాత్రం గుర్తింపు ఉండేది కాదు. ఇది ఒక సర్కిల్ లాంటిది. రానున్న పదేళ్లలో పరిస్థితులు మరో విధంగా మారవచ్చు. బాలీవుడ్ లో ఇప్పుడు లోటు ఏర్పడింది. ఆ లోటును తీర్చడానికి త్వరలోనే కొత్త దర్శకులు కూడా పుట్టుకొస్తారు. ముఖ్యంగా హిందీ చిత్ర పరిశ్రమ గొప్ప దర్శకులను ప్రేక్షకులకు అందించనుందని నమ్ముతున్నా.. కాకపోతే వారు ముంబైతో సంబంధం లేకుండా బయట వారే అయి ఉంటారని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు బయట వారే హిందీ చిత్ర పరిశ్రమను ఒక స్థాయికి తీసుకువెళ్తారు ” అంటూ విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు. అయితే విజయ్ దేవరకొండ బయట వ్యక్తులే హిందీ పరిశ్రమను లేపుతారు అంటూ కామెంట్లు చేయడంతో పుసుక్కున్న ఇంత మాట అన్నాడు ఏంటి విజయ్..? అంటూ అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈయన ఆంటీ ఫ్యాన్స్ అయితే.. అంతే బాలీవుడ్ లో స్టార్ దర్శకులు లేరా ..స్టార్ నటీనటులు లేరా.. వాళ్లు కాకుండా బయట వాళ్ళు వచ్చి కొత్తగా లేపేదేముంది.. అంటూ కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉండగా.. మరికొంతమంది టాలెంట్ ఉన్నవారికి కూడా హిందీ పరిశ్రమ చాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.. అనే కోణంలోనే విజయ్ కామెంట్లు చేసి ఉంటాడు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ సినిమాలు..
ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలోని అటు ఒకవైపు సినిమాపై ప్రమోషన్స్ చేస్తూనే మరొకవైపు ఇలాంటి కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు సమాచారం.