Vijay Kanakamedala: టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ కు మంచి క్రేజ్ ఉంది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, ముగ్గురు హీరోలు కలిసి నటిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ భైరవం చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ కనకమెడల కొంత గ్యాప్ తీసుకొని ఈ మూవీతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. అల్లరి నరేష్ తో, 2023 లో ఉగ్రం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ముగ్గురు మల్టీ స్టార్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ కనకమెడల తన నెక్స్ట్ మూవీ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు ఆ వివరాలు చూద్దాం..
టాలివుడ్ బడా హీరోలతో వరుస సినిమాలు..
విజయ్ కనకమెడల నాంది చిత్రంతో, దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీలో అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో పోషించారు. ఈ చిత్రంతో దర్శకుడిగా విజయ్ కనకమెడలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మరోసారి అల్లరి నరేష్ తో ఉగ్రం చిత్రాన్ని నిర్మించి మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడు ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. భైరవం చిత్రం ప్రమోషన్స్ లో విజయ్ కనక మెడల ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఫాన్స్ తో పంచుకున్నారు. ఆయన తదుపరిచిత్రం గురించి ప్రస్తావిస్తూ.. కొన్ని స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏ హీరోతో అని అనుకోలేదు. నలుగురు హీరోల కోసం కథలు సిద్ధం చేసి పెట్టుకున్నాను భైరవం సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు చూసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తాను. మెగా స్టార్ చిరంజీవి గారి కోసం ఒక కథను సిద్ధం చేసుకున్న అలాగే బాలకృష్ణ గారు వెంకటేష్ గారి కోసం కూడా ఒక కథను సిద్ధం చేశాను.ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు కథ వినిపించడం జరిగింది. వారిద్దరికీ కథ నచ్చింది. భైరవం తరువాత ప్రేక్షకుల ఇచ్చే రెస్పాన్స్ని చూసి నా నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేస్తాను అంటూ విజయ్ కనకమెడల సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయ్ కనకమెడల నెక్స్ట్ మూవీ మెగా హీరోలతో చేయబోతున్నారని తెలుస్తోంది. ఆయన టాలీవుడ్ బడా హీరోలకు కథల సిద్ధం చేయడం ఫాన్స్ కి సంతోషాన్ని కలిగిస్తుంది.విజయ్ కనకమెడల నుండి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదు..
ఇక భైరవం మూవీ మే 30 నా రిలీజ్ కు సిద్ధమైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటినుంచో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు హీరోలకు ఈ చిత్రం కీలకం కానుంది. ఈ చిత్రంలో అతిధి శంకర్, ఆనంది, దివ్యా, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ చరణ్ అందించనున్నారు. శ్రీ చరణ్ తో విజయ కనకమెడల ఇది రెండవ చిత్రం.
Manchu Vishnu: అలా చేసిన రోజు బ్రతికున్నా చచ్చినట్టే – మంచు విష్ణు..!