Tollywood..ఒక్కొక్క జనరేషన్లో కొంతమంది హీరోయిన్ల శకం నడుస్తూ ఉంటుంది. అలా ఇప్పటి జనరేషన్లో ముఖ్యంగా ఈ ఇయర్లో మాత్రం ఈ ముగ్గురు భామలకే వెరీ క్రేజ్.. ఈ ముగ్గురు భామలకి సౌత్ లో ఉన్న డిమాండ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ ముగ్గురు భామలు ఎవరంటే..మమితా బైజు (Mamita Baiju), కాయాదు లోహర్(Kayadu Lohar), ఇవానా(Ivana).. ఈ ముగ్గురు హీరోయిన్లకు సౌత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లకి క్రేజ్ వచ్చింది కూడా ఏదో 10, 15 సినిమాలతో కాదు కేవలం ఒకే ఒక్క సినిమాతో. అలా సౌత్ లో భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్ల లిస్టులో ఈ ముగ్గురు హీరోయిన్ల పేర్లే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవానా, కాయాదు లోహర్ లకి మాత్రం తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి.
డ్రాగన్ తో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న కాయాదు లోహర్..
ఇక డ్రాగన్ బ్యూటీ కాయాదు లోహర్ చేతిలో ప్రస్తుతం 5,6 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ హీరోయిన్ తమిళంలో మూడు, తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే ఇవానాకి కూడా చాలానే క్రేజ్ ఉంది. ఇక ‘డ్రాగన్’ సినిమాతోనే కాయాదు లోహర్ కి అదృష్టం వరించింది.ఆ తర్వాత ఎంతోమంది దర్శక నిర్మాతలు ఈ హీరోయిన్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అలా ఇప్పటికే ధనుష్(Dhanush), శింబు(Simbu), అధర్వ(Adharva), జీవి ప్రకాష్(GV Prakash) వంటి హీరోలతో కాయాదు స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.
లవ్ టుడే మూవీ తో ఇవానా క్రేజ్ పెరిగిందిగా..
ఇక హీరోయిన్ ఇవానా విషయానికి వస్తే..ఈ ముద్దుగుమ్మ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)’లవ్ టుడే’ సినిమాతో ఫేమస్ అయ్యింది.ఈ ఒక్క సినిమాతో కుర్రాళ్ళ క్రష్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటుంది. అలా రీసెంట్ గా శ్రీవిష్ణు (Srivishnu) తో చేసిన ‘#సింగిల్’ మూవీ హిట్ కొట్టడంతో ఇవానాకి మరింత క్రేజ్ దక్కింది.
ALSO READ:Tollywood: ఈ ఆర్మీ జవాన్ దగ్గర ఇంత క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..?
మలయాళ బ్యూటీ కి తెలుగులో ఆఫర్లు.
ఇక మలయాళ బ్యూటీ మమితా బైజు గురించి చూస్తే..ఈ ముద్దుగుమ్మ మలయాళం లో ‘ప్రేమలు’ సినిమాతో ఫేమస్ అయ్యింది.ఈ సినిమా కంటే ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రేమలు సినిమా మాత్రమే మమితా బైజుకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె క్యూట్ క్యూట్ లుక్స్ కి చాలామంది ఫిదా అయ్యారు. అలా మమితా బైజు ఇప్పటి వరకు తెలుగులో సినిమాలు ఒప్పుకోకపోయినప్పటికీ మంచి ఆఫర్స్ వస్తే తెలుగులో కూడా నటించడానికి రెడీ అంటుంది.అలా సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్లుగా ఇవానా, మమితా బైజు,కాయాదు లోహర్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల మొదలు సీనియర్ హీరోల వరకు కొత్త అమ్మాయిని పెట్టుకోవాలంటే ఈ ముగ్గురు హీరోయిన్లనే తీసుకోవాలనుకుంటున్నారట.. అలా ఈ హీరోయిన్లకే అవకాశాలు రావడంతో పారితోషికాన్ని కూడా భారీగానే పెంచారు. ముఖ్యంగా ఇవానా ఇప్పుడు రూ.కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వీరికున్న క్రేజ్ కారణంగా అటు దర్శక నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం.