BigTV English

Vijay Sethupathi: పుష్ప ఆఫర్.. నిజాలు చెప్పలేను

Vijay Sethupathi: పుష్ప ఆఫర్.. నిజాలు చెప్పలేను

Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగువారికి కూడా సుపరిచితుడే. ఉప్పెన సినిమాతో తెలువగువారిని తన నటనతో ఫిదా చేసిన ఆయన ఇప్పుడు మహారాజ సినిమాతో మరోసారి తెలుగువారికి దగ్గరయ్యాడు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు.


తమిళ్, తెలుగు భాషల్లో కూడా ఇదే మాట వినిపిస్తుంది. తమిళ్ లో కంటే తెలుగులోనే ఈసారి విజయ్ సేతుపతి ప్రమోషన్స్ బాగా చేశాడు. వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇక మహారాజ విషయానికొస్తే.. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూపించారు. కూతురుకు జరిగిన అన్యాయానికి ఒక తండ్రి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది కథ.

తండ్రి పాత్రలో విజయ్ అదరగొట్టాడు. ఇక ఈ సినిమా విజయం అందుకోవడంతో మేకర్స్.. సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో విజయ్.. రిపోర్టర్స్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. అప్పట్లో పుష్ప సినిమా ఆఫర్ ను విజయ్ సేతుపతి తిరస్కరించాడంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఉప్పెన లోని రాయనం నటన చూసిన సుకుమార్.. పుష్ప లో విలన్ కోసం ముందు విజయ్ సేతుపతినే సంప్రదించారని, అయితే ఆ ఆఫర్ ను ఆయన రిజెక్ట్ చేసాడని వార్తలు వచ్చాయి.


తాజాగా ఇదే ప్రశ్న ఒక రిపోర్టర్ అడగ్గా.. విజయ్ సమాధానం ఇచ్చాడు. ” అలాంటి ఆఫర్ ఏది నా దగ్గరకు రాలేదు.. కొన్నిసార్లు.. కొన్ని ప్లేసెస్ లో నిజాలు చెప్తే బాగోదు. కొన్నిసార్లు అబద్దాలు కూడా చెప్పాలి” అని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు పుష్ప ఆఫర్ రిజెక్ట్ చేయడం నిజామా.. ? అబద్దమా.. ? అని అభిమానులు డైలమాలో పడ్డారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి RC16 లో నటిస్తున్నాడు.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×