BigTV English

Vijay Sethupathi – Maharaja OTT: వంద కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘మహారాజ’ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Vijay Sethupathi – Maharaja OTT: వంద కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘మహారాజ’ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Vijay sethupathi maharaja ott release date(Cinema news in telugu): కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో తెలుగు సినిమాలతో ఆడియన్స్‌ను ఆకటుకున్నాడు. దీంతో అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒక్క హీరో పాత్రలోనే కాకుండా విలన్ పాత్రలోనూ నటించి అదరగొట్టేశాడు. గతంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ మూవీలో విలన్ పాత్రలో నటించి దుమ్ము దులిపేశాడు. ఇలా తనకిచ్చిన ఎలాంటి పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోతాడు.


మరి అలాంటి విలక్షణ యాక్టింగ్ కింగ్ విజయ్ సేతుపతి ఇటీవల కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ‘మహారాజ’ అనే సినిమాతో వచ్చి ఎవరూ ఊహించని కల్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మరొక బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నితిలన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్‌దాస్ వంటి నటీ నటులు కీలక పాత్రలు పోషించి అదరగొట్టేశారు.

Also Read: మరో హిట్ కొట్టేసిన విజయ్ సేతుపతి.. మహారాజా అదిరింది


విజయ్ సేతుపతి కెరీర్‌లో 50 వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ట్రీట్ అందించింది. తెలుగుతో పాటు తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘మహారాజ’ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. దీంతో నిర్మాతలకు లాభాల పంట పండిందనే చెప్పాలి. కేవలం రూ.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో విడుదల అయిన ఈ సినిమా ఏకంగా రూ.20 కోట్ల వరకు వసూళ్లు సాధించి నిర్మాతలకు ఐదింతల లాభాలను తెచ్చిపెట్టింది.

దీంతో ఈ ఏడాది తమిళంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా మహారాజ నిలిచింది. ఇక థియేటర్లలో దుమ్ము దులిపేస్తున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వంద కోట్లు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని జూలై 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజు స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Tags

Related News

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Tv Kissik Talk Show : అవసరానికి వాడుకొని వదిలేశారు..లవ్ స్టోరీ గురించి నిజాలు చెప్పిన రైతుబిడ్డ..

Big Stories

×