BigTV English

Loksabha Deputy speaker race: డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే- ఇండియా కూటమికా? లెక్కలు..

Loksabha Deputy speaker race: డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే- ఇండియా కూటమికా? లెక్కలు..

Loksabha Deputy speaker race(Political news telugu): లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై కన్నేసింది బీజేపీ. ఈ ఛాన్స్‌ను ఇండియా కూటమికి ఇవ్వకూడదనే ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి మిత్రులతో మంతనాలు సాగిస్తోంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవికి పోటీ తప్పదని భావిస్తే.. కూటమిలో మిత్రులైన టీడీపీ లేదా జేడీయూకి ఇవ్వాలని ఆలోచన చేస్తోందట మోదీ సర్కార్.


లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకోవాలని మోదీ టీమ్ భావిస్తోంది. ఇందుకోసం జాగ్రత్తగా పావులు కదుపుతోంది. దీనికి పోటీ ఉన్నట్లయితే మిత్రుల్లో ఒకరికి ఇవ్వాలన్నది కమలనాథుల ఆలోచన.  ఒకవేళ పోటీ లేని పక్షంలో బీజేపీ అభ్యర్థికే అప్పగించాలని ప్లాన్ చేసినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

స్పీకర్ పదవి విషయంలో ఎన్డీయే-ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీంతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఎన్నిక జరిగింది. వాస్తవానికి డిప్యూటీ స్పీకర పదవి కారణంగానే స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి పార్టీలు. లోక్‌సభలో ఈసారి బలం పెంచుకున్న కాంగ్రెస్, డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇస్తే.. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తామని షరతు పెట్టింది. దీనికి బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. దీంతో ఎన్నిక అనివార్యమైంది.


ALSO READ:  కేంద్ర బడ్జెట్‌.. మధ్య తరగతి జీవులకు దక్కే ఊరటలేంటి ?

కూటమి వ్యవహరశైలిని గమనించిన బీజేపీ పెద్దలు ఈసారి భాగస్వామి పార్టీలకు ఆ పదవి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతానికి ఇప్పటికైతే సంప్రదింపులు జరుపుతోందట. అటు ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు కూడా ఈ విషయమై చర్చించాయి. మోదీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం బట్టి అప్పుడు అడుగులు వేద్దామని అన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పోటీ తప్పదని భావిస్తే.. టీఎంసీ, డీఎంకెను రంగంలోకి దించాలని ఇండియా కూటమి ఆలోచనగా చెబుతున్నారు. రాజకీయ చదరంగంలో డిప్యూటీ స్పీకర్ పోస్టు ఎవరిదో చూడాలి.

Tags

Related News

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Uttarkashi Cloudburst: ఉత్తరకాశీ విషాదం.. 28 మంది కేరళా టూరిస్టులు గల్లంతు.. పెరుగుతోన్న మరణాల సంఖ్య

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

Big Stories

×