Vijaya Shanti: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజ్నోవా (Anna Lezhneva) ఇటీవల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం గుండు గీయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన కొడుకు ఆరోగ్యం కుదుటపడాలని అన్నదానానికి ఆమె రూ.17 లక్షల విరాళం కూడా ప్రకటించారు.. అంతేకాదు భోజనశాలలో ప్రత్యేకంగా భక్తులకు భోజనం వడ్డించి, వారితో కలిసి ఆమె భోజనం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. దీనిపై చాలామంది అన్నా లెజ్నోవాతో పాటు ఆమె కుమారుడిపై కూడా కొంతమంది బీభత్సంగా ట్రోల్స్ చేస్తున్నారు.. అయితే ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ నుంచి ఒక విజయశాంతి (Vijayashanti ) తప్ప ఏ ఒక్కరూ మద్దతు పలకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అన్నా లెజ్నోవాకు మద్దతుగా విజయశాంతి..
ఇకపోతే అన్నా లెజ్నోవాతో పాటు ఆమె కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar Pawanovich) పై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో విజయశాంతి స్పందిస్తూ..” దేశం కానీ దేశం నుంచి వచ్చి.. పుట్టుకతోనే వేరే మతం అయినా సరే.. హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా.. ఇలాంటి ఈమెపై కామెంట్లు చేయడం దురదృష్టకరం.. అమంజసం.. తన కొడుకు అగ్నిప్రమాదం నుండి బయట పడ్డాడని, తన విశ్వాసాన్ని నిలబెట్టిన దైవం కోసం ఆమె కృతజ్ఞతలుగా తలనీలాలు సమర్పించి, అన్నదానం ట్రస్టుకు విరాళం ఇచ్చింది. మన సాంప్రదాయాన్ని గౌరవించిన ఆమెపై కూడా ఇలా ట్రోల్స్ చేయడం పద్ధతిగా లేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది విజయశాంతి.
సెలబ్రిటీలపై అభిమానులు అసహనం..
అయితే అన్నా పై జరుగుతున్న ట్రోల్స్ పై విజయశాంతి తప్ప ఎవరూ స్పందించకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే అందరూ స్పందించే సిని సెలెబ్రిటీలు.. ఇలా పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్ గుప్పిస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం పై పలువురు నెటిజన్స్, అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు ట్రోల్స్ చేసే వారిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నా.. సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా అన్నా లెజ్నోవాపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించకపోవడంపై ఇది ఇండస్ట్రీకే సిగ్గుచేటు అని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
గుండు గీయించుకోవడం వల్లే అన్నాపై ట్రోల్స్..
ఇకపోతే ఇటీవల ఏప్రిల్ 8వ తేదీన సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్ళకు, చేతులకు గాయాలు అవడమే కాకుండా ఊపిరితిత్తులలో పొగ చేరింది. దీంతో వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్యం మార్క్ శంకర్ ను హాస్పిటల్కు తరలించారు. బ్రాంకోస్కోపీ కూడా చేయించారు. విషయం తెలుసుకున్న సురేఖ (Surekha ), చిరంజీవి(Chiranjeevi )దంపతులు హుటాహుటిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ బయలుదేరగా.. మరొకవైపు డిప్యూటీ సీఎం అదే సమయంలో మన్యం పర్యటనలో ఉండగా.. పర్యటన పూర్తి చేసుకొని అన్నా వదినతో కలిసి బయలుదేరారు. అక్కడ మార్క్ శంకర్ కి చికిత్స చేయించి నాలుగు రోజుల తర్వాత అనగా హనుమాన్ జయంతి రోజు వారిని ఇండియాకి తీసుకొచ్చారు. ఇక ప్రమాదం తర్వాత అన్నా తన మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్లి గుండు గీయించుకొని తలనీలాలు సమర్పించడంతో ఇప్పుడు ట్రోల్స్ మొదలయ్యాయి.