BigTV English

Branded Luxury Items For Less: రూ.30 లక్షలు ఖరీదు చేసే బ్యాగ్ రూ.లక్షకే.. చైనా ఆఫర్ల వెల్లువ

Branded Luxury Items For Less: రూ.30 లక్షలు ఖరీదు చేసే బ్యాగ్ రూ.లక్షకే.. చైనా ఆఫర్ల వెల్లువ

Branded Luxury Items For Less: మీకు తెలుసా ఇప్పుడు చైనా కంపెనీలు ఎక్కడ లేని ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వేరే దేశం నుంచి కొంటే లక్షలు చెల్లించాలి.. మా వద్ద కొనండి మేము వేలల్లో కాదు వందల రూపాయల్లో విక్రయిస్తున్నామంటూ బంపర్ ఆఫర్ల వెల్లువ కురిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి సోషల్ మీడియాని చైనా కంపెనీలు విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. దీని ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న వాణిజ్య యుద్ధం.


ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దేశాలన్నీ వాణిజ్య యుద్ధంలో తలమునకలై ఉన్నాయి. ఈ యుద్ధం అందరికీ నష్టదాయకంగా ఉన్నా.. చైనాకు మాత్రం భారీ నష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అత్యధిక ఎగుమతులు చైనా చేస్తోంది. అమెరికన్ కాంటనెంట్, యురోప్ దేశాలు, ఇండియా, గల్ఫ్, రష్యా ఇలా ప్రతి దేశం కూడా చైనా నుంచే అత్యధిక దిగుమతులు చేసుకుంటుంది. చైనా వస్తువులు తక్కువ ధరలో లభించడమే దీనికి కారణం. అయితే చైనా నుంచి దిగుమతి చేసుకునే దేశాలు ఆ ఉత్పత్తుల ధరలకు ఎన్నో రెట్లు పెంచేసి బ్రాండెడ్ ఐటెమ్స్ గా విక్రయిస్తున్నారు.

అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యుకె లాంటి పాశ్చాత్య దేశాలకు చెందిన బ్రాండెడ్ కంపెనీలు చైనా నుంచి అతి తక్కువ ధరకు దిగుమతి చేసుకొని వాటిపై తమ లోగో పెట్టి వాటిని ఎన్నో వందల రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు బర్కిన్ (Birkin), లూయిస్ వుయిట్టన్ (Louis Vuitton) లాంటి లగ్జరీ బ్రాండ్ బ్యాగులు పాశ్చాత్య, గల్ఫ దేశాల్లో లక్షలు ఖరీదు చేస్తాయి. అయితే ఈ లక్షలు ఖరీదు చేసే లగ్జరీ ప్రాడక్ట్స్ ఇప్పుడు ప్రజలకు ఈ తయారీ దారులు వేల రూపాయల్లో ఇచ్చేస్తున్నారు.


Also Read: ప్లాట్ vs సిప్ పెట్టుబడి..ఒకదానితో భద్రత, మరొకదానితో సంపద, మీకు ఏది ముఖ్యం?

ఉదాహరణకు ఒక బర్కిన్ బ్యాగు ధర అమెరికా, ఇంగ్లాండ్ లో 34,000 అమెరికన్ డాలర్లు (రూ.29,23,320) ఉంటే అదే బ్యాగుని కేవలం 1400 అమెరికన్ డాల్లర్లకు (రూ.1లక్ష 20 వేలు)మాత్రమే ఇచ్చేస్తున్నారు. సాధారణంగా ఈ లగ్జరీ బ్యాగు, షూస్ తయారీ కంపెనీలు దారులు తక్కువ మార్జిన్ లో లాభాలు పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీలకు విక్రయిస్తుంటాయి. కానీ బ్రాండెడ్ కంపెనీలు తమ లోగోని మాత్రమే ఆ బ్యాగుపై పెట్టి అదే బ్యాగుని దాని రియల్ ధర కన్నా 90 శాతం ఎక్కువకు విక్రయిస్తుంది. ఈ విషయాన్ని ఈ తయారీ కంపెనీల స్వయంగా బయటపెట్టేస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించి తమ వద్ద బ్రాండెడ్ క్వాలిజీ ప్రాడక్ట్స్ కొనుగోలు చేయాలని.. టిక్ టాక్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విపరీతంగా యాడ్స్ ఇస్తున్నాయి.

ఇప్పుడే ఎందుకు ఆఫర్లు?

ఇదంతా ఇంతకుముందు ఎందుకు జరగలేదు. ఇంతకాలం వీరు ప్రజలకు ఈ బ్రాండెడ్ క్వాలిటీ ప్రాడక్ట్స్ ఎందుకు విక్రయించలేదు అనే ప్రశ్న ఇప్పుడు నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం కూడా ఉంది. చైనా ఎగుమతి చేసే బ్రాండెడ్ ప్రాడక్ట్స్ లో అధిక శాతం అమెరికా కొనుగోలు చేస్తుంది. కానీ ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలని అక్కడే వస్తువులు ఉత్పత్తి చేస్తూ అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు కల్పించాలనే నిశ్చయడం తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే అన్ని దేశాల నుంచి దిగుమతులు తగ్గించి లోకల్ గా తయారీ చేయాలని పిలుపునిచ్చారు.

దిగుమతులు తగ్గించేందుకు ఆ వస్తువుల పై విపరీతంగా సుంకాలు విధిస్తున్నారు. చైనా నుంచే ఎక్కువ దిగుమతులు వస్తాయి కాబట్టి.. చైనా దేశ సరుకులపై 145 శాతం వరకు పన్నులు (టారిఫ్‌లు) విధించారు. చైనా నుంచి తక్కువ ధరకే వచ్చే బ్రాండెడ్ బట్టలు, షూస్, బ్యాగ్స్, ఎలెక్ట్రానిక్స్, ఇతర యాక్ససెరసీని అమెరికన్లు ఇష్టపడతారు. కానీ వాటిని అమెరికాలోనే తయారు చేయాలని.. చైనా నుంచి కొనుగోలు చేస్తే తమకు నష్టమని ట్రంప్ వాదన. ఇప్పుడు ట్రంప్ సుంకాలతో చైనా ఎక్స్ పోర్ట్ బిజినెస్ కంపెనీలు భారీగా నష్టపోతున్నారు. అందుకే అమెరికాకు ధీటుగా చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.

ప్రభుత్వ అనుమతి

అమెరికా, పాశ్చాత్య దేశాల్లో లభించే భారీ బ్రాండెడ్ ఐటెమ్స్ కు కాపీ కొట్టి అదే క్వాలిటీతో ప్రజలకు నేరుగా విక్రయించేందుకు అన్ని చైనీస్ కంపెనీలకు చైనా ప్రభుత్వం అనుమతులచ్చేసింది. తమకు జరిగే నష్టాన్ని పూడ్చుకోవడం కోసమే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఇప్పుడు బ్రాండెడ్ బట్టలు, షూస్, ఇతర ఖరీదైన ఆక్ససరీస్ అన్నీ చాలా చీప్ గా వాటి తయారీ కంపెనీలు ప్రజలకు విక్రయించడం మొదలు పెట్టాయి. అమెరికా బ్రాండ్స్ అయిన ఫిలా, అండర్ ఆర్మర్, లులు లెమన్ కు చెందిన బట్టలు ఒక్కోటి 100 అమెరికన్ డాలర్లకు ఆయా దేశాల్లో లభిస్తాయి. కానీ అదే ప్రాడక్ట్‌ని చైనా కంపెనీలు కేవలం 5 నుంచి 6 డాలర్లకు విక్రయిస్తున్నాయి.

అమెరికా సుంకాలు చైనా ఇలా దీర్ఘకాలం కొనసాగితే చైనా ఈ ఆఫర్లు ఇతర దేశాల ప్రజలకు కూడా అందిస్తామని చెబుతోంది. చైనా ఇంత తక్కువ ధరకు బ్రాండెడ్ ఐటెమ్స్ విక్రియంచడంతో పాశ్చాత్య కంపెనీల బ్రాండ్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. చైనా కూడా ట్రంప్ దెబ్బకు సమాధానం చెప్పేందుకు ఇదే కోరుకుంటోంది.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×