Vijayashanthi Remuneration : కళ్యాణ్ రామ్ చేస్తున్న మూవీ అర్జున్ సన్పాఫ్ వైజయంతి. ఆయనకు బ్యాక్ టు బ్యాక్ అపజయాల తర్వాత వస్తున్న మూవీ ఇది. మళ్లీ బింబిసార లాంటి బ్లాక్ బాస్టర్ విజయం రావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్న సమయం ఇది. అయితే ఈ సినిమాపై నార్మల్ గానే కొంత వరకు అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు సీనియర్ హీరోయిన్… అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీ రోల్ చేస్తున్న నేపథ్యంలో… అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ మూవీకి కం బ్యాక్ ఇస్తున్న విజయశాంతి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో అనే టాపిక్ ఆసక్తిగా మారింది.
విజయశాంతి ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఎలిన హీరోయిన్. కేవలం హీరోయిన్ మాత్రమే కాదు… లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి.. యాక్షన్ హీరో అంటూ ఆడియన్స్ నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అయితే తర్వాత ఈ రాములమ్మ పొలిటికల్ గా యాక్టివ్ కావడంతో… సినిమాలకు దూరం అయింది.
మధ్యలో అనిల్ రావిపూడి – మహేష్ బాబు కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు అనే మూవీలో కనిపించింది. ఆ… సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో… విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది అని అందరూ అనుకున్నారు. కానీ, ఆ సినిమా హిట్ అయినా… కూడా విజయశాంతి మళ్లీ మరో సినిమా చేయలేదు.
మళ్లీ ఇన్నాళ్లకు నందమూరి కళ్యాణ్ రామ్ మూవీలో కీలక పాత్ర చేస్తుంది. అయితే ఈ సినిమాతో అయినా… సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, విజయశాంతి ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు. అంతే కాదు… తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అది కానీ, నిజం అయితే… విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు కూడా ఉండకపోవచ్చు.
ఇదిలా ఉండగా… అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీకి విజయశాంతి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క సినిమాకే ఆమె 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందట. అంటే… ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ తో సమానంగా అని అర్థం.
ఒకప్పుడు ఈమె స్టార్ హీరోయినే కావచ్చు. కానీ, ఆమె చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అందులోనూ… ఆమె మరో సినిమా చేసే ఛాన్స్ కూడా ఎమ్మెల్సీ అవ్వడం వల్ల తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ల తో సమానంగా… 3 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం ఏంటా..? ఇండస్ట్రీ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, సినిమాపై విజయశాంతి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందులో నో.. డౌట్స్. అది సరిలేరు నీకెవ్వరు మూవీతో కూడా ప్రూవ్ అయింది. అందుకే కావొచ్చు… ఈ లేడీ సూపర్ స్టార్ కు ఇంత మొత్తంలో ఇస్తున్నారు.