BigTV English

Mega 157: తప్పదు.. వెంకీలా చిరు కూడా చేయాల్సిందే.. అనిల్ దగ్గర బేరాలు లేవమ్మా..

Mega 157: తప్పదు.. వెంకీలా చిరు కూడా చేయాల్సిందే.. అనిల్ దగ్గర బేరాలు లేవమ్మా..

Mega 157: చాలావరకు యంగ్ డైరెక్టర్స్ అంతా ఎన్ని హిట్లు కొట్టినా సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసే విషయంలో కాస్త తడబడతారు. కానీ అనిల్ రావిపూడి కాస్త డిఫరెంట్. సీనియర్ హీరోలను డైరెక్ట్ చేస్తున్నప్పుడే అనిల్‌కు మరింత జోష్ వస్తుందనుకుంటా. అందుకే వెంకటేశ్ లాంటి స్టార్ హీరోతో కలిసి మూడు సినిమాలు చేయగా.. ఆ మూడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్స్ అయ్యాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి సైతం అనిల్ రావిపూడిని నమ్మి తరువాతి సినిమా తనతో చేయడానికి ఒప్పుకున్నారు. అలా సినిమా ఒప్పుకున్నారో లేదో.. ఇలా అనిల్ చెప్పిన ప్రతీదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పడం లేదు చిరు. ఆయన కూడా వెంకీ బాటలో నడవడ తప్పదని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


అప్పుడే ప్రమోషన్స్

అనిల్ రావిపూడి (Anil Ravipudi), చిరంజీవి (Chiranjeevi) కాంబినేషన్‌లో తెరకెక్కే మెగా 157 సినిమా తాజాగా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ పూజా కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు సైతం చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సంతోషంగా బయటపెట్టారు మేకర్స్. అంతా అయిపోయిన తర్వాత మెగా 157 గ్యాంగ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ మరొక వీడియోను విడుదల చేశాడు అనిల్ రావిపూడి. మామూలుగా సినిమా ప్రారంభమయ్యి షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రమోషన్స్ ప్రారంభిస్తారు మేకర్స్. కానీ అనిల్ రావిపూడి మాత్రం కాస్త డిఫరెంట్ అని, పూజా కార్యక్రమం నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


తప్పించుకోలేని పరిస్థితి

అనిల్ రావిపూడి చివరిగా వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అయితే ఈ మూవీని ప్రమోట్ చేయించడానికి నేరుగా వెంకటేశ్‌ను రంగంలోకి దించాడు అనిల్. థియేటర్లలో ఈ సినిమా విడుదలయినప్పటి నుండి ఆఖరికి బుల్లితెరపై ప్రసారం అయ్యేవరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అందులో వెంకటేశ్ పాల్గొంటూనే ఉన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక పాటను వెంకటేశ్‌తో కూడా పాడించారు. అది కూడా మూవీ ప్రమోషన్‌కు బాగా ప్లస్ అయ్యింది. ఇప్పుడు చిరంజీవి కూడా అవన్నీ చేయక తప్పదని తెలుస్తోంది.

Also Read: వారెవ్వా.. ఏం ఎదుగుదట.. చిరు మూవీకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్

పాట పాడాలి

అనిల్ రావిపూడితో సినిమా ఒప్పుకున్నారు కాబట్టి చిరంజీవి కూడా ఎప్పటికప్పుడు రీల్స్ చేయాల్సి ఉంటుందని, ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుందని, పాటలు పాడాల్సి ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా మెగా 157కు భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో మొత్తం అయిదు పాటలు ఉండగా.. ఇప్పటికే మూడు పాటలకు సంబంధించిన ట్యూన్స్ రెడీ అయ్యాయని, ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని సమాచారం. ఇక అందులో ఒక పాటను మెగాస్టార్‌తో పాడించే ఆలోచనలో ఉన్నారట అనిల్. ఇలా అయితే చిరంజీవి కూడా వెంకీ మామ బాటలో నడవక తప్పదని, ఇది అనిల్ రూల్ అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Related News

Balayya: బాలయ్య తెల్లవారుజాము 3 గంటలకు నిద్రలేచి చేసే పని ఇదేనట, వామ్మో!

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×