BigTV English

Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.. అలా అనేసారేంటి?

Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.. అలా అనేసారేంటి?

Gaddar Awards: తెలంగాణ, ఆంధ్రా కలిసి ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు నంది అవార్డులను అందించారు. అయితే ఈ మధ్య తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఎవరూ పట్టించుకోలేదు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు నంది అవార్డులు ఇవ్వాలని పలుమార్లు మాట్లాడారు. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇటీవల జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ విషయంపై సినీ ప్రముఖుల సలహా కావాలని ముఖ్యమంత్రి కోరారు. ఇక జూన్ 14న ఈ అవార్డులను అందించనున్నట్టు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇప్పటికే అనౌన్స్ చేశారు.. తాజాగా ఈ అవార్డుల పై సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి, భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయ్యింది.


గద్దర్ అవార్డ్స్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా ఆయనను గద్దర్ అవార్డ్స్ పై ప్రశ్నించారు. గద్దర్ అవార్డ్స్ పై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా..దానికి ఆయన సమాధానం చెబుతూ.. గద్దర్ అవార్డ్స్ అన్న పేరు వద్దని నేను సీఎం గారికి చెప్పాను. కానీ ఆయన లేదన్నా ఆల్రెడీ ఫిక్స్ చేసేసాము అని అన్నారు. సినీ ఇండస్ట్రీకి అవార్డు రావడం నాకు సంతోషమే కదా అందుకే నేను ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయానని అన్నారు. ఎందుకు గద్దర్ అవార్డ్స్ వద్దని అన్నారు అని మళ్ళీ యాంకర్ ప్రశ్నించారు.  గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ యోధుడు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. తన సాహిత్యంతో తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచారు గద్దర్. అలాంటి వ్యక్తిని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డులు ఇవ్వడం ఏంటి అని అనుకున్నాను. జానపదాల గురించి తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన అవార్డ్స్ పెట్టింటే బాగుండు అని నా అభిప్రాయం. ఇక అంత ఫైనల్ అయిన తర్వాత నేనేం మాట్లాడుతాను అందుకే సైలెంట్ అయిపోయాను అని తమ్మారెడ్డి భరద్వాజ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నెట్టింట మరో చర్చ జరుగుతుంది..


Also Read : ఓ మహిళకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన మెగా కోడలు.. ఎందుకంటే..?

గద్దర్ అవార్డ్స్..

ఇక 2013లో ఆఖరిగా హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరిగింది. ఆ కార్యక్రమంలో 2011లో రిలీజైన సినిమాలకు సంబంధించిన అవార్డులను బహుకరించారు.ఇప్పుడు జూన్ 14 న ఈ గద్దర్ అవార్డులను అందించనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పటికే దీని కోసం 15 మందితో ఓ స్పెషల్ జ్యూరీని కూడా ఏర్పాటు చేసి, 2024లో వచ్చిన సినిమాల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసి మే చివర్లో కమిటీకి పంపనుందని కూడా దిల్ రాజు తెలిపారు. జ్యూరీ పంపిన వివరాలను పరిశీలించి, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని జూన్ 14న గ్రాండ్ గా నిర్వహిస్తామని టీఎఫ్ఎస్సీ చైర్మన్ దిల్ రాజ్ అన్నారు. గద్దర్ అవార్డ్స్ విషయంలో సినిమా నిర్మాతకు రూ.10 లక్షలు, దర్శకుడికి రూ.7 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ చలనచిత్ర అవార్డులతో సమానంగాగతంలో వచ్చిన అవార్డుల కన్నా ఎక్కువగా ఈ అవార్డులకు ప్రైజ్ మనీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అవార్డ్స్ కోసం ఎన్ని సినిమాలను ఎంపిక చేశారు. ఏ క్యాటగిరికి అవార్డులు దక్కాయో అన్నది తెలియాల్సి ఉంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×