Mission Vatsalya Scheme 2025: పసిబిడ్డల చిరునవ్వు.. మన సమాజ భవిష్యత్తుకు అద్దం. కానీ తల్లి, తండ్రి ప్రేమ లేకుండా జీవితం ప్రారంభించిన పిల్లలు ఎందరో ఉన్నారు. అటువంటి నిస్సహాయ పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆశాజ్యోతి నింపుతోంది అదే మిషన్ వాత్సల్య పథకం.
ఏపీ ప్రభుత్వం అనాథ పిల్లలకోసం ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించింది. మిషన్ వాత్సల్యం పేరుతో అనాథ చిన్నారులకు నెలకు రూ. 4 వేలు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ ఫథకం కోసం ప్రభుత్వం రూ.19.12 కోట్లు నిధులు విడుదల చేసింది. అసలు ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలి వంటి వివరాలు తెలుసుకోవడానికి.. వెంటనే అంగన్ వాడీ కార్యకర్తలను సంప్రదించవలసి ఉంటుంది. ఆలస్యం చేయకండి ఈ మీ పిల్లల భవిష్యత్తుకు చాలా అవసరం.
2025-26 తొలి త్రైమార్షిక చెల్లింపుల కోసం ఏపీ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. తల్లి దండ్రులు ఆదరణ లేని చిన్నారులకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పిస్తూ ఈ మిషన్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకానికి అర్హులు
ఈ పథకానికి సంబంధించి ప్రాథమికంగా దరఖాస్తుల పరిశీలన జిల్లా, రాష్రస్థాయిలో జరుగుతుంది. తల్లి, దండ్రులు కోల్పోయిన పిల్లలు, విడాకులు తీసుకుని కుటుంబాన్ని వదిలేసిన పిల్లలు, పిల్లలు అనాథలుగా ఉండి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నవారు, తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధికి గురైన వారు.. కుటుంబ ఆర్ధిక పరిస్థితులు బాగలేక పిల్లలను చూసుకోలేని వారు, ఇతర కారణాల వల్ల అనాథలుగా మిగిలిన చిన్నారుల ఈ పథకం అర్హులు. కనీసం 18 సంవత్సరాల వరకు ప్రభుత్వం నెలకు రూ.4 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
మిషన్ వాత్సల్య పథకం కింద సదుపాయాలు పొందాలంటే కొన్ని దశలను అనుసరించాలి:
1. బాల హక్కుల లేదా సంరక్షణ అవసరమైన సమాచారం ఉన్నా: స్థానిక చైల్డ్ లైన్ 1098 (టోల్ ఫ్రీ) కు కాల్ చేయాలి. లేదా స్థానిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కి సమాచారం ఇవ్వాలి.
2. అనాథ లేదా సంరక్షణ అవసరమున్న పిల్లల కోసం అప్లికేషన్: ఫోస్టర్ కేర్ లేదా అడాప్షన్ కోసం దరఖాస్తు చేయాలంటే.. Central Adoption Resource Authority (CARA) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాలి. లేదంటే.. జిల్లా బాల సంక్షేమ అధికారి కార్యాలయంను సంప్రదించవచ్చు.
3. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేదా మహిళా శిశు అభివృద్ధి శాఖ వెబ్‌సైట్ ద్వారా.. గ్రాంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు (కొందరికి సంబంధించి):
-బర్త్ సర్టిఫికేట్ లేదా వయస్సు ధృవీకరణ
-తల్లిదండ్రుల మరణ ధృవీకరణ (అనాథలకు)
-ఆదాయ ధ్రువీకరణ (అవసరమైతే)
-అడాప్షన్ దరఖాస్తు ఫారమ్ (CARA ద్వారా)
అంగన్‌వాడీ పరిధిలో కార్యకర్తలు అడిగి వివరాలు సేకరించవచ్చు..
మిషన్ వాత్సల్య పథకం అమలు విమోచన కేంద్రాలు, బాల గృహాలు, జిల్లా బాల సంక్షేమ అధికారుల (DCPOs) ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ పథకం కింద అనాథ పిల్లలు, సంరక్షణ అవసరమున్న వారు, తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలు సహాయాన్ని పొందవచ్చు.
Also Read: ఆ ఐదుగురు బాలికలకు గోల్డెన్ ఛాన్స్.. విమానంలో ప్రయాణించే అవకాశం
అయితే ఈ పథకం కోసం అప్లై చేసుకునే కుటుంబ.. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 72 ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.96 వేలు మించకూడదు. తల్లికి వందనం పథకం వర్తించేవారు దీనికి అర్హులు.. అంగన్వాడీలు ఈ పథకానికి సంబంధించి.. గ్రామాల్లో అవగాహన తీసుకొచ్చి.. అర్హత ఉన్న పిల్లలను గుర్తించి, నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. క్రమం తప్పకుండా యాప్ ద్వారా సమాచారం అందించాలని కూడా తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథంకం గురించి తెలియని వారు చాలా మంది ఉంటారని.. అనాథ పిల్లలు ఉన్నట్లైతే వారికి ఈ స్కీమ్ గురించి చెప్పి, అప్లై చేసుకునేలా చూడాలని అధికారులు పేర్కొన్నారు.