Arjun Son Of Vyjayanthi Pre Teaser :చాలా రోజుల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి (Vijay Shanti) ప్రధాన పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా వస్తున్న చిత్రం ‘అర్జున్ S/o వైజయంతి’. ఇక ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri)దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఈ సినిమా నుండి విడుదల చేస్తున్న ప్రతి అప్డేట్ కూడా అభిమానులలో అంచనాలు పెంచేస్తోంది. ఇక అందులో భాగంగానే తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసిన ప్రీ టీజర్ ఒక్క షాట్ తోనే సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఈ ఒక్క షాట్ ద్వారా సినిమా హై లెవెల్ యాక్షన్ డ్రామా లాగా ఉండబోతోందనే ఫీలింగ్ కలుగుతోంది అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉండబోతున్నట్లు ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది.
ప్రీ టీజర్ తో అంచనాలు పెంచేసిన యూనిట్..
కళ్యాణ్ రామ్ అంటేనే మాస్, యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు.. అలాంటి ఈయన ఈసారి మరింత స్టైలిష్ మాస్ అవతారంలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రీ టీజర్ లో కనిపించే ఫ్రేమింగ్ సినిమా విజువల్ టోన్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. టీజర్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఒకవైపు కళ్యాణ్ రామ్ పాత్ర రణరంగంలోకి దిగింది అన్నది ఎంత నిజమో.. మరోవైపు వైజయంతి ఐపీఎస్ పాత్రలో ఏ విధంగా ఆకట్టుకోబోతోంది అనే ఉత్కంఠ కూడా రేకెత్తుతోంది. ఇక దర్శకుడు ఈ సినిమా కథను కేవలం యాక్షన్ కోణంలో మాత్రమే కాకుండా.. తల్లీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా కూడా మలిచినట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ (Ajaneesh Lokanath)అందిస్తున్న నేపథ్య సంగీతం మరింత బలాన్ని ఇస్తుందని, ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక తాజాగా ఈ ప్రీ టీజర్ విడుదల చేయగా.. అందులో సముద్రం ఒడ్డున బోటు పై సముద్రాన్ని చూస్తూ కూర్చున్న కళ్యాణ్ రామ్.. వైట్ షర్ట్ వెనుక భాగము మొత్తం రక్తంతో నిండిపోయింది. తప్పు చేసిన తర్వాత ఈ క్షణం ఒంటరిగా కూర్చొని దేనికోసమో ఆలోచిస్తున్నట్టు కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఫోజు ఇప్పుడు సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.
టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
ఇక టీజర్ రిలీజ్ డేట్ కూడా ఈ ప్రీ టీజర్ లోనే అనౌన్స్ చేశారు. మార్చి 17వ తేదీన పూర్తి టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని ముప్పా అశోక్ వర్ధన్, సునీల్ బాలుసు నిర్మిస్తున్నారు. ఇది కేవలం సాధారణ మాస్ సినిమా కాదని, మిస్టరీ, యాక్షన్ మిక్స్ చేసి చాలా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో కొడుకు తప్పు చేస్తే తల్లి అరెస్టు చేస్తుందా అనే కోణంలో కూడా ఆడియన్స్ ను ఆలోచింపచేసేలా చేశారు డైరెక్టర్. ఇక ప్రీ టీజర్ తోనే ఇన్ని అంచనాలు పెంచేసారంటే.. ఇక ఫుల్ టీజర్ తో ఇంకెన్ని ఇంటెన్స్ మూమెంట్స్ బయటకు వస్తాయో చూడాలి.