ITR Filing Notice| ఇన్ కమ్ ట్యాక్స్ నియమాల్లో క్రమం తప్పకుండా మార్పులు, అప్డేట్స్ జరుగుతూనే ఉంటాయి. నిర్దిష్ట ఆదాయం మించిపోతే ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి. ప్రస్తుతం దేశంలో పాత, కొత్త ఆదాయ పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. ఇది మిస్ అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో జీతభత్యాలు పొందేవారికి పెద్ద ఉపశమనం అందించారు. సంవత్సరానికి 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఇది కాకుండా స్టాండర్డ్ డిడక్షన్ కింద మరో 75 వేల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 12.75 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న నిబంధన ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. 12.75 లక్షల వరకు పన్ను లేకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి.
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం వీరికి తప్పనిసరి..
వాస్తవానికి కనీస పన్ను పరిమితి దాటితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానం ప్రకారం సంవత్సరానికి 4 లక్షల ఆదాయం దాటితే ఐటీఆర్ దాఖలు చేయాలి. అంటే 4 లక్షలలోపు ఆదాయం ఉంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 4 లక్షల ఆదాయం దాటితే పన్ను చెల్లించినా.. చెల్లించకపోయినా ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. కొందరు నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటినా పన్ను చెల్లించడం లేదు.
Also Read: ఒక్కసారి పెట్టుబడి పెడితే.. 30 ఏళ్లపాటు రూ.33 వేల ఆదాయం!
గత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించాల్సి ఉండి కూడా ఐటీఆర్ దాఖలు చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ ఇలాంటి వారిని గుర్తించింది. సంబంధిత జాబితా సిద్ధం చేసింది. బోర్డు కూడా ఆమోదించడంతో ఇప్పుడు అందరికీ నోటీసులు ఇన్కమ్ టాక్స్ శాఖ పంపుతోంది. ఇలాంటి వారిపై సెక్షన్ 148ఎ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ శాఖ నోటీసులు పంపుతున్న వారిలో ఎక్కువ మంది 2018-19, 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు ట్యాక్స్ బకాయిలు చెల్లించని వారు, ఐటిఆర్ ఫైల్ చేయని వారున్నారు.
ఇన్కమ్ టాక్స్ శాఖ ప్రస్తుతం వార్షిక సమాచార ప్రకటన (ఎఐఎస్), టీడీఎస్ లేదా టీసీఎస్ స్టేట్మెంట్, ఆర్థిక లావాదేవీల ద్వారా పన్ను తప్పించుకునే వారిని గుర్తించింది. త్వరలో అందరికీ నోటీసులు అందనున్నాయి. నోటీసులకు వివరణ ఇవ్వకపోయినా, స్పందించకపోయినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. అయితే ఇప్పటికీ బయటపడేందుకు అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఎవరైనా పన్ను తప్పించుకుని ఉంటే, “కండిషన్ ఆఫ్ డిలే” కింద దరఖాస్తు చేసుకుని వడ్డీతో సహా పన్ను చెల్లిస్తే ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ సౌలభ్యానికి కాస్త సమయం పడుతుంది.