BigTV English

Vikram: విక్రమ్ మూవీకి కోర్టు క్లియరెన్స్… మరి థియేటర్స్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Vikram: విక్రమ్ మూవీకి కోర్టు క్లియరెన్స్… మరి థియేటర్స్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Vikram: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌(Vikram)కు ఎందుకీ పరిస్థితి? అనే ప్రశ్న అందరికీ ఒక ఆసక్తికరమైన విషయంగా మారింది. చివరగా తంగలాన్ (Thangalaan) సినిమాతో మళ్లీ ట్రాక్‌లో పడ్డాడు అని ఆయన అభిమానులు భావించారు. తాజాగా ఇప్పుడు తర్వాత వీర ధీర సూరన్ (Veera Dheera Sooran) అనే సినిమా చేశాడు విక్రమ్. ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా 27 మార్చి న విడుదల తేదీని ప్రకటించారు. అయినా కూడా అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. చివరి నిమిషంలో థియేటర్‌లలో మార్నింగ్ షోస్ రద్దు చేయడం అనేది అనుకోని పరిణామంగా మారింది. ఈ సినిమా విషయంలో ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు కావడంతో వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా కోర్టు క్లియరెన్స్ రావడంతో రిలీజ్‌కు సిద్ధమైంది.


కోర్టు క్లియరెన్స్.. విడుదల ఎప్పుడంటే?

ముంబాయ్‌కు చెందిన బీ4యూ అనే కంపెనీ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కుల విషయంలో మేకర్స్‌పై కేసు ఫైల్ చేసింది. ఈ కేసులో విచారణ జరిపిన తర్వాత ‘వీర ధీర శూరన్’ మేకర్స్ చేసిందే తప్పు అని ఢిల్లీ హైకోర్టు తేల్చింది. బీ4యూ కంపెనీ ఈ కేసు గెలవడంతో ‘వీర ధీర శూరన్’ మేకర్స్ వెంటనే వారికి రూ.7 కోట్లు కట్టాలని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ 48 గంటల్లోపు కోర్టుకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూవీ టీమ్ అయోమయంలో పడింది. కోర్టు తీర్పుకు షాక్ అయిన వీర ధీర శూరన్ మేకర్స్.. చేసేది లేక సమస్యను సదరు సంస్థతో మాట్లాడి సాల్వ్ చేసుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ స్క్రీనింగ్ సిద్దమైంది వీర ధీర శూరన్. కోర్టు క్లియరెన్స్ రావడంతో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి థియేటర్లలోకి రానుంది ఈ సినిమా.


అసలు గొడవేంటి?

ముంబయికి చెందిన పేరొందిన నిర్మాణ సంస్థ ‘B4U0′..’వీర ధీర శూర’ సినిమా థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ హక్కులను తమకు అమ్ముతామంటూ ఇచ్చిన ఒప్పందాన్ని చిత్ర నిర్మాతలు పక్కన పెట్టారని ఆరోపించింది. ఒప్పందానికి విరుద్ధంగా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమ్ముకున్నట్టుగా తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ మేకర్స్ ఓటీటీ రైట్స్ అమ్మేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 7 కోట్ల బకాయిలు చెల్లించిన తర్వాతే సినిమా విడుదల చేయాలని కేసు నమోదు చేయడంతో.. విడుదల విషయంలో మరింత జాప్యం ఏర్పడింది. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా వీర ధీర సూరన్ మార్నింగ్ షోస్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. రిలీజ్ వాయిదా పడింది. ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్న వారికి రిఫండ్ చేస్తామని ప్రకటించాయి థియేటర్ యాజమాన్యాలు. ఫైనల్‌గా ఇప్పుడు సమస్యను పరిష్కరించుకొని విడుదలకు సిద్దమయ్యారు.

Related News

Balayya: బాలయ్య తెల్లవారుజాము 3 గంటలకు నిద్రలేచి చేసే పని ఇదేనట, వామ్మో!

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×