Actor Vinayakan: సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరు ఎక్కడైనా? ఎప్పుడైనా? కనిపిస్తే చాలు.. వెంటనే నెటిజెన్స్ ఫోటోలు తీసి లేదా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటి ఖాతాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి కూడా ఇలాంటి వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ఒకరకంగా సెలబ్రిటీలకు పాపులారిటీని అందించినా.. ఇంకొక రకంగా వారి క్యారెక్టర్ పై బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుందని చెప్పవచ్చు.
వీధి దుకాణదారుడితో గొడవపడ్డ వినాయకన్..
ఇకపోతే కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకొని, అనుకోకుండా కొన్ని గొడవల్లో సోషల్ మీడియా ద్వారా బాగా ట్రెండ్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో మలయాళ నటుడు వినాయకన్ (Vinayakan)ను కూడా ఒకరు. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాలో విలన్ పాత్ర పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇందులో తన అద్భుతమైన విలనిజం తో పాటు కామెడీ కూడా పండించి అలరించారు. అలాంటి ఈయన తాజాగా గోవా వీధుల్లో టీ కొట్టు వ్యక్తితో గొడవ పడుతూ కనిపించాడు. ఇక వినాయకన్ బిగ్గరగా అరుస్తుండడంతో ప్రజలు కూడా గుమిగూడారు. అయితే ఈ వీడియోని కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. అయితే ఆ వీడియోలో టీ కొట్టు దుకాణం వ్యక్తితో ఊగిపోతూ.. గొడవ పడడం మనం చూడవచ్చు. అయితే ఈ వీడియో చూసిన కొంతమంది మత్తులో ఉండి, అలా వాగుతున్నాడేమో అంటూ కొంతమంది కామెంట్లు చేయగా.. మరి కొంతమంది దుకాణదారుడితో మీకు గొడవ ఏంటి సార్..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ఇకపోతే వినాయకన్ గొడవ పడడం ఇదేమి మొదటిసారి కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. గోవా నుంచి కొచ్చికి వెళ్లే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఆయన గొడవపడ్డారు. అయితే ఈయన దురుసుతనాన్ని గుర్తించిన సిఐఎస్ఎఫ్ అధికారులు వెంటనే మత్తులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక తర్వాత ఆయనను బెయిల్ మీద విడిపించారు.
పోలీసులకే సవాల్ విసిరిన వినాయకన్..
అయితే గొడవ అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఈయన.. పలు ఆసక్తికర కామెంట్లు కూడా చేశారు. “రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో గొడవ పడినప్పుడు నేనేమీ మత్తులో లేను. కావాలంటే అక్కడ ఉన్న సిసిటీవీ ఫుటేజ్ చూడండి” అంటూ పోలీసులకే సవాలు విసిరారట వినాయకన్. అలా అప్పుడు కూడా వార్తల్లో నిలిచారు.
2023లో కూడా..
అంతేకాదు 2023లో కూడా ఈయన ఎర్నాకులం పోలీస్ స్టేషన్లో ఒక ఘటనపై దోషిగా నిర్ధారించి, అరెస్టు కూడా చేయబడినట్లు సమాచారం. వ్యక్తిగత విషయం చెప్పేందుకే పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఆయన, మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు నిగ్రహాన్ని కోల్పోయి గందరగోళం సృష్టించినట్లు సమాచారం.
Vinayakan 🤦🏻🤷🏻 pic.twitter.com/OgFe4yH7eC
— AB George (@AbGeorge_) November 22, 2024