Devendra Fadnavis: సీఎం ఎవరు అవుతారు అనే విషయంలో ఎలాంటి గొడవలు లేవని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు తమకు అద్భుతమైన విజయాన్ని అందిచారన్నారు. ప్రజలు మోడీ వెంట ఉన్నారనేదానికి ఇదే సంకేతమని చెప్పారు. ప్రధాని ఇచ్చిన ఏక్ హైతో సేఫ్ హై నినాదంతో అన్ని వర్గాల ప్రజలు తమకు ఓటు వేశారని ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. ఇది మహాయుతి విజయమని ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, రామ్ దాస్ అత్వాలే ఉమ్మడి విజయం అని చెప్పారు.
Also read: ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. అడుగుపెట్టిన ప్రతీ చోట విజయమే..
సీఎం ఎవరు అనేదానిపై మూడు పార్టీల నేతలు కూర్చుని చర్చించారని, ఎన్నికల తరవాత రోజే ఓ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ నిర్ణయాన్నే అందరూ ఆమోదించాలని అన్నారు. ఇదే సమావేశంలో మహారాష్ట్ర సీఎం షిండే మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అండగా ఉన్న బీజేపీ పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మోడీ, అమిత్ షా, నడ్డా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్రకు వాళ్లు ఎంతో సపోర్ట్ ఇచ్చారని అన్నారు. ఎన్నికల ముందే తాను 200 సీట్లు గెలుస్తున్నామని చెప్పానని, ఆ మాట నిజం అయినందుకు గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విజయం కూటమి సభ్యులు అంతా ఒక టీమ్ లా పనిచేశామని చెప్పారు. ఇదిలా ఉంటే మహాయుతి కూటమి ఎన్నికల్లో 288 స్థానాలకు గానూ 224 స్థానాల్లో విజయం సాధించింది. మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 54 సీట్లకు పరిమితమైంది.