BigTV English
Advertisement

Vishal: ప్రమాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్న విశాల్‌

Vishal: ప్రమాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్న విశాల్‌

Vishal:హీరో విశాల్ పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న మార్క్ ఆంటోని అనే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విశాల్ స‌రికొత్త గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. స‌మ‌యంలో అనుకోకుండా ఓ వావానం అదుపుత‌ప్పి విశాల్ సహా అక్కడున్న యూనిట్ పైకి దూసుకొచ్చింది. అప్ర‌మ‌త్తంగా ఉండ‌టంతో వారంద‌రూ త‌ప్పించుకున్నారు. ఎవ‌రికీ ఎలాంటి గాయాలు త‌గ‌ల‌లేదు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.


సాధార‌ణంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో విశాల్ ఎలాంటి డూప్ లేకుండా న‌టిస్తుంటారు. ఆయ‌న ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ప్ర‌తీ సినిమాకు ఏదో ఒక గాయం అవుతూనే ఉంటుంది. శ‌రీరంపై కుట్లు ప‌డుతూనే ఉంటాయి. అయినా కూడా రిస్క్ చేయ‌టానికి విశాల్ ఆలోచించ‌డు. మార్క్ ఆంటోని సినిమా షూటింగ్‌లోనూ ఆలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. అయితే ఈసారి ఏమాత్రం అజాగ్ర‌త్త‌తో ఉండినా విశాల్ ప్రాణాల‌పైకి వ‌చ్చుండేది. ఎవ‌రికీ ఏమీ జ‌ర‌గ‌లేదు. దీంతో యూనిట్ అంతా ఊపిరి పీల్చుకుంది. సాంకేతిక లోపం కార‌ణంగా వాహ‌నం అదుపు త‌ప్పిన‌ట్లు తెలుస్తుంది.

మార్క్ ఆంటోని సినిమా పీరియాడిక్ మూవీగా రానుంది. అదిక్ రవిచంద్రన్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రీతూవ‌ర్మ ఇందులో హీరోయిన్‌. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత విశాల్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న స్పై థ్రిల్ల‌ర్ డిటెక్టివ్ 2 షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారు.


Mahesh Babu: మ‌రో చిన్నారి ప్రాణం కాపాడిన మ‌హేష్‌.. సాయం చేసిన ప్రొడ్యూస‌ర్‌

Ram Charan: ఆ విషయం ముందు ఎన్టీఆర్‌కు చెప్పా: రామ్‌చరణ్

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×