BigTV English

America China:ఆ విషయంలో అమెరికా, ఇండియా మధ్య ఒప్పందం..

America China:ఆ విషయంలో అమెరికా, ఇండియా మధ్య ఒప్పందం..

America China:ప్రపంచ దేశాలు ఒకదానికి ఒకటి సాయం చేసుకుంటూ ముందుకెళ్తే ఎన్నో ప్రశ్నలకు సులువుగా సమాధానాలు దొరికే అవకాశం ఉంది. మునుపటితో పోలిస్తే ఈమధ్యకాలంలో ప్రపంచ దేశాల మధ్య సాన్నిహిత్యంతో పాటు పోటీ కూడా పెరిగిపోయింది. అయినా కూడా కొన్ని దేశాలు కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా ఇండియా, అమెరికా కూడా ఓ కొత్త ఒప్పందంపై సంతకం చేశాయి.


ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసెట్) పేరుతో ఫిబ్రవరీలో అమెరికా, ఇండియా ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దీని వల్ల ఇండియా, అమెరికా మధ్య ఉన్న సంబంధాలు మరికొంత బలపడనున్నాయి. 1960 నుండి ఇండియా, అమెరికా కలిసి టెక్నాలజీల విషయంలో ఎన్నోసార్లు కలిసి ముందుకెళ్లాలని ప్రయత్నించాయి. కానీ అందులో చాలావరకు ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయాయి. కానీ ఐసెట్ మాత్రం అలా జరగదని వారు ధీమాతో ఉన్నారు.

ఇంతకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం ఇండియా కూడా టెక్నాలజీ, ఎకానమీ విషయంలో చాలా బలపడింది. అందుకే ఐసెట్ విషయంలో అమెరికా చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఐసెట్‌కు సంబంధించి అమెరికా, ఇండియా.. ఆరు విభాగాల్లో కలిసి నడవనున్నాయి.. ఎకోసిస్టమ్స్‌ను బలపరచడంలో, డిఫెన్స్‌లో టెక్నాలజీని పెంచడంలో, సెమికండక్టర్ సప్లై చైన్స్ విషయంలో, స్పేస్ విభాగంలో, స్టెమ్ టాలెంట్‌ను పెంపొందించడంలో, టెలికాంను అభివృద్ధి చేయడంలో.


ఇప్పటివరకు అమెరికా, ఇండియా కలిసి చేసిన ఎన్నో ప్రయత్నాల్లో ఐడియాలు అందించేవారు ఉన్నా.. వాటిని ముందుకు తీసుకెళ్లడంలో విఫలం అవుతూ వచ్చారు. అలా అయినా కూడా కో ఆపరేషన్ వల్ల ఈ రెండు దేశాలకు జరిగిన మంచి కూడా చాలానే ఉంది. అమెరికాలో ఎకానమీని పెంచడానికి ఇండియన్స్ ప్రయత్నించారు. అలాగే ఇండియాలో వ్యవసాయ రంగంలో టెక్నాలజీని అందించడానికి అమెరికా తగిన సాయం చేసింది. అలాగే ఇప్పుడు కూడా ఈ రెండు దేశాలు కలిసి ఐసెట్‌ను విజయవంతం చేయాలని ఆశిస్తున్నాయి.

ISRO Missions:స్పేస్‌కు వెళ్లనున్న ఇస్రో ఫీమేల్ రోబో ‘వ్యోమిత్ర’.. ఎప్పుడంటే..?

Korean Scientists:బ్రిడ్జిల ధృడత్వాన్ని గమనిస్తూ ఉండే టెక్నాలజీ..

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×