BigTV English

Kannappa: పుష్ప 2 వాయిదా లేదు అంటున్నారు.. కన్నప్ప కూడా అప్పుడే వస్తున్నాడు.. అసలేం జరుగుతుందిరా

Kannappa: పుష్ప 2 వాయిదా లేదు అంటున్నారు.. కన్నప్ప కూడా అప్పుడే వస్తున్నాడు.. అసలేం జరుగుతుందిరా

Kannappa: పుష్ప 2.. డిసెంబర్ లో కూడా రిలీజ్ కావడం లేదంటగా అంటే నిజమే అని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం సుకుమార్ – అల్లు అర్జున్ మధ్య విభేదాలు అని టాక్ నడుస్తోంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప.


రెండేళ్ల క్రితం డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. స్టైలిష్ స్టార్ ను కాస్త ఐకాన్ స్టార్ గా మార్చింది. ఇక ఈ సినిమా తరువాత బన్నీ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. దాదాపు రెండేళ్లుగా పుష్ప 2 కోసమే కష్టపడుతున్నాడు. అయితే షూటింగ్ మొత్తం ఫినిష్ చేసి ఆగస్టు 15 న రిలీజ్ చేయాలనీ మేకర్స్ ముందుగానే ప్లాన్ చేశారు. కానీ, అది జరగలేదు.

షూటింగ్ ఇంకా పూర్తీ కాకపోవడంతో.. ఆగస్టు నుంచి డిసెంబర్ కు పుష్ప 2 వాయిదా పడింది. ఇక ఈ విభేదాల వలన డిసెంబర్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కష్టమని తెలుస్తోంది. ఇంకోపక్క అలాంటిదేమి లేదని, అనుకున్న సమయానికి అనుకున్నట్టుగానే పుష్ప 2 రిలీజ్ ఉంటుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ఇదే అదునుగా కన్నప్ప.. రిలీజ్ డేట్ ను ప్రకటించి షాక్ ఇచ్చాడు.


నిజం చెప్పాలంటే పుష్ప 2 తో ఢీకొట్టే దైర్యం చేయలేని కొన్నిసినిమాలు పుష్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే వెనక్కి తప్పుకున్నాయి. అలాంటింది.. పుష్ప వస్తున్నాడు అని తెలిసిన కన్నప్ప డిసెంబర్ లో వస్తున్నాను అని ప్రకటించడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది.

నిజంగానే పుష్ప 2 వాయిదా పడనుందా.. ? అందుకే కన్నప్ప డిసెంబర్ లో వస్తున్నట్లు ప్రకటించాడా.. ? అనేది తెలియాలి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ రెండు రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×