BigTV English

Nara Lokesh: కపట నాటకాలకు కాలం చెల్లింది : నారా లోకేష్

Nara Lokesh: కపట నాటకాలకు కాలం చెల్లింది : నారా లోకేష్

Nara Lokesh Comments on ys jagan: మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. అవినీతి, హింస గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉందన్నారు. బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆరాచకపు ఆనవాళ్లను కూడా కూకటి వెళ్లతో పెకిలిస్తుంది. ప్రజాతీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ అసత్య ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మల్లా నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.


రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. శవాలతో రాజకీయాలు చేసే విష సంస్కృతికి ప్రజలు తీర్పు ఇచ్చారు. నేరాలు చేసి వాటిని మాపై నెట్టే కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటననూ ఉపేక్షించం. ఏ నిందితుడినీ వదిలేది లేదు. మీ హెచ్చరికలు బయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం మాది అని లోకేష్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వినుకొండలో నడి రోడ్డుపై జరిగిన హత్యాకాండపై గురువారం ట్విట్టర్ వేదికగా జగన్ స్పందించారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించలేదన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వైసీపీని అణగదొక్కేందుకే దాడులకు తెగబడుతున్నారని జగన్ మండిపడ్డారు.

కొత్త ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే రాష్ట్రం హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు ,విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు. వినుకొండ హత్య ఘటన దీనికి నిదర్శనంగా నిలిచిందన్నారు. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణకాండకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కొందరు వ్యక్తులు రాజకీయ దురుద్దేశంతో వెనకుండి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుతవం పోలీసులు, సహా యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసిందని జగన్ ట్వీట్ చేశారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×