VishnuPriya :గత కొన్ని రోజులుగా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్.. ప్రత్యేకించి యూట్యూబర్స్ ప్రజలను తప్పుదోవ పట్టించి, వారిని ఆర్థికంగా దోచుకుంటూ స్వలాభం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్ భూతం ఎంతోమంది ప్రాణాలను తీస్తోంది కూడా.. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం తమకేమీ పట్టనట్టుగా సొంత లాభం కోసం చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు.
అయితే ఈ విషయాలన్నీ ఏవి తెలియని అమాయకపు ప్రజలు.. వీరు చెప్పే బూటకపు మాటలు నమ్మి బెట్టింగ్ కూపంలో పడిపోతున్నారు. ఇప్పటికే చాలామంది ఈ బెట్టింగ్ యాప్ లలోకి దిగి ఆర్థిక నష్టంతోపాటు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇక మరి కొంతమంది నష్టపోయామని తెలుసుకొని, వెంటనే పోలీసులను ఆశ్రయించిన వారు కూడా ఉన్నారు. ఇలా ఈ మధ్యకాలంలో రోజురోజుకీ ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఐపీఎస్ వీసీ సజ్జానర్ (VC.Sajjanar) రంగంలోకి దిగారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అరెస్ట్ అయిన యూట్యూబర్స్..
సోషల్ మీడియా ద్వారా రోజుకొక వీడియో షేర్ చేస్తూ..భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన కొంతమంది యూట్యూబర్లు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పేరిట సొంతంగా లాభపడుతూ .. ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న నేపథ్యంలో.. కొంతమంది యూట్యూబర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నాని(Nani ) అనే ఒక యూట్యూబర్ ను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు, ఇప్పుడు సన్నీ యాదవ్(Sunny Yadav) పై కూడా కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఇతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న విష్ణు ప్రియ.. అరెస్ట్ తప్పదంటూ..
అలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న వారిని అరెస్టు చేస్తున్న నేపథ్యంలో తాజాగా విష్ణు ప్రియ (Vishnupriya) ని కూడా అరెస్టు చేయాలి అంటూ.. ఆమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వీడియోని నేరుగా వీసీ సజ్జనార్ కు షేర్ చేస్తూ.. “పాపులర్ సెలబ్రిటీ అయిన విష్ణు ప్రియ ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. దయచేసి ఈమెపై తగిన యాక్షన్ తీసుకోండి” అంటూ ఎక్స్ వేదికగా ఒక ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు.
అంతేకాదు ఆమె ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియోని కూడా జోడించడం జరిగింది. మొత్తానికి అయితే సెలబ్రిటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె, ప్రజలను వారి బాగోగులను దృష్టిలో పెట్టుకోకుండా.. సొంత లాభం కోసం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈమె పై తగిన యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుతున్నారు.
Betting apps promote cheste… రంగు పడుద్ది!#SayNoToBettingApps #Holi #HolikaDahan pic.twitter.com/lWaQSMyIl6
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 14, 2025
సజ్జనార్ సీరియస్ వార్నింగ్…
ఇకపోతే నేడు హోలీ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేశారు వీసీ సజ్జనార్. బెట్టింగ్ భూతాన్ని పారద్రోలే ప్రయత్నంలో వీసీ సజ్జనార్ ఒక అడుగు ముందుకు వేశారు. అందులో భాగంగానే ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే.. రంగు పడుద్ది అంటూ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. “బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న నకిలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల గురించి, మీరు మాకు తెలియజేయడమే కాకుండా వారిని బ్లాక్ చేయొచ్చు కూడా.. ఇదే విషయాన్ని మీ స్నేహితులకు కూడా ట్యాగ్ చేయండి. అలాగే వాటిని స్క్రీన్ షాట్ తీసి నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి” అంటూ హోలీ పండుగ సందర్భంగా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ సజ్జనార్ ఒక ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Respected @SajjanarVC sir
Vishnu Priya Bhimeneni a popular actor is promoting the betting apps
Please take necessary action @TelanganaCOPs @Cyberdost
Also attaching the video of proof #Telangana #influencers #BettingApps https://t.co/DRqNlvcc1w pic.twitter.com/XUB60aNvif— MAD MAX (@AlWaYsPaWwAn) March 2, 2025