Potato Cleaning Hacks: బంగాళాదుంపలను దాదాపు ప్రతి ఇంట్లో వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. కానీ వాటి తొక్కలను చెత్తబుట్టలో వేస్తారు. ఇంటిని శుభ్రం చేయడంలో బంగాళదుంప తొక్కలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయో మీకు తెలిస్తే , మీరు వాటిని పారవేయడానికి బదులుగా శుభ్రం చేయడానికి ఉపయోగించడం ప్రారంభిస్తారు. బంగాళదుంప తొక్కలు సహజ శుభ్రపరిచే ఏజెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మురికి పాత్రలను శుభ్రపరచడంలో చాలా బాగా పనిచేస్తాయి. బంగాళదుంప తొక్కలతో ఇంటిని శుభ్రం చేసే పద్ధతి , దాని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంపతో శుభ్రపరిచే హక్స్:
ఇనుము, ఉక్కు పాత్రల పై భాగాలు తుప్పు పట్టడం సర్వసాధారణం. బంగాళదుంప తొక్కలు తుప్పు తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించడానికి.. బంగాళదుంప తొక్కలను తుప్పు పట్టిన ప్రదేశంలో రుద్దండి. దీనిలో ఉండే స్టార్చ్ తుప్పును తొలగించడంలో సహాయపడుతుంది. మెరుగైన ఫలితాల కోసం తొక్కలపై కొంచెం బేకింగ్ సోడా చల్లి, ఆపై రుద్దండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గాజు వస్తువులను శుభ్రపరచడం:
బంగాళదుంప తొక్కలు గాజు , అద్దాలను శుభ్రం చేయడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. గాజును వస్తువులను శుభ్రం చేయడానికి బంగాళదుంప తొక్క లోపలి భాగాన్ని గాజు ఉపరితలంపై రుద్దండి. దీని తరువాత గాజు వస్తువులను పొడి క్లాత్ తో తుడవండి. ఈ పద్ధతి గాజు పాత్రలను శుభ్రంగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా కొత్త వాటిలాగా కనిపించేలా తయారు చేస్తుంది.
పాత్రల మెరుపును పెంచండి:
మీరు ఇంట్లో వాడే పాత్రలు మురికిగా,నిస్తేజంగా కనిపిస్తే.. బంగాళదుంప తొక్కలు వాటిని ప్రకాశవంతం చేయడంలో సహాయపడతాయి. ఇందుకోసం బంగాళదుంప తొక్కలను గోరు వెచ్చని నీటిలో ఉంచండి. ఈ నీటితో పాత్రలను కడిగి, సున్నితంగా స్క్రబ్బర్‌తో రుద్దండి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగిన తర్వాత పాత్రలు మెరుస్తాయి. కొత్త వాటిలాగా కనిపిస్తాయి.
ఫ్రిజ్ శుభ్రపరచడం:
బంగాళదుంప తొక్కలు రిఫ్రిజిరేటర్‌లోని దుర్వాసన, మురికిని తొలగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్రిజ్ శుభ్రం చేయడానికి తొక్కలను రిఫ్రిజిరేటర్‌లో మురికి ఉన్న భాగంలో పెట్టి కొంత సమయం పాటు అలాగే ఉంచండి. తర్వాత వాటితో ఆ భాగాన్ని రుద్ది తడి గుడ్డతో తుడవండి. ఇది ఫ్రిజ్‌ను శుభ్రపరచడమే కాకుండా దాని నుండి వచ్చే దుర్వాసనను కూడా తొలగిస్తుంది.
Also Read: డిష్ వాషింగ్ స్పాంజ్‌లో బ్యాక్టీరియా.. ఇలా వాడితే చాలా డేంజర్ !
తోలు బూట్లు శుభ్రపరచడం:
తోలు బూట్లు లేదా బ్యాగులపై పేరుకుపోయిన మురికిని తొలగించడంలో బంగాళదుంప తొక్కలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని కోసం బూట్ల ఉపరితలంపై తొక్కలను రుద్దండి. తర్వాత పొడి క్లాత్‌తో తుడవండి. ఇది బూట్లకు కొత్త మెరుపును ఇస్తుంది. అంతే కాకుండా మెరిసేలా చేస్తుంది.
బంగాళదుంప తొక్కలు వివిధ రకాల వస్తువులను శుభ్రపరచడానికి మాత్రమే కాకుండా.. పర్యావరణానికి కూడా సురక్షితమైనవి. ఇవి మీ ఇంటిని శుభ్రంగా ,మెరిసేలా ఉంచడంలో సహాయపడే సహజమైన, చవకైన , సులభమైన ఎంపిక. ఇక నుండైనా మీరు బంగాళదుంపలను తొక్క తీసేటప్పుడు, వాటిని పారవేయడానికి బదులుగా ఇలా శుభ్రపరిచేందుకు ఉపయోగించండి.