Kannappa:గత కొన్ని నెలలుగా మంచు కుటుంబంలో గొడవలు.. అందరి నోట్లో హాట్ టాపిక్ గా మారాయి. మోహన్ బాబు (Mohan babu ), మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరొకవైపు మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం ఇందులో ఈ మధ్య కలగజేసుకోకుండా తనకు కన్నప్ప సినిమా ఇంపార్టెంట్ అని, ఆ తర్వాతే అన్నీ అంటూ చెబుతున్నారు. ఇకపోతే ఇదే విషయంపై మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రతి ఇంట్లో కూడా గొడవలు జరగడం సహజం. అది అందరి నోట్లో నానడం మాక్కూడా నచ్చడం లేదు. కానీ మీడియా వాళ్ళు చేసే కొంత అతి వల్ల మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా 90% మీడియా మిత్రులు మంచివాళ్లే కానీ ఆ 10 శాతం మంది లేనిపోనివి కల్పించి, రాస్తూ మా పరువును తీస్తున్నారు. దీనికి ఇంకా సమయం పడుతుంది. దేనికైనా సమయం రావాలి కదా.. కానీ ఖచ్చితంగా మారిపోతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు కదా “అంటూ తెలిపారు మంచు విష్ణు.
ఈ సినిమాలో మా తమ్ముడు, అక్కకు అవకాశం కల్పించలేదు..
ఇకపోతే తాను ప్రెస్టేజియస్ మూవీగా తీసుకున్న కన్నప్ప సినిమాలో తన తమ్ముడు మంచు మనోజ్(Manchu Manoj), తన అక్క మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna) కు అవకాశం కల్పించకపోవడం పై కూడా క్లారిటీ ఇచ్చారు. “కన్నప్ప సినిమాలో అక్కకు, మనోజ్ కి అవకాశం ఇవ్వకపోవడానికి కారణం ఇది కుటుంబ కథా చిత్రంలా ఉండకూడదని మాత్రమే. అందుకే వారికి అవకాశం కల్పించలేదు. ఒకవేళ మనోజ్ కి తగ్గ పాత్ర ఉండి ఉంటే, కచ్చితంగా అవకాశం ఇచ్చేవాడినేమో తెలియదు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్(Akshay kumar)ను శివుడి పాత్ర కోసం మెప్పించడానికి కేవలం కొన్ని నిమిషాలే పట్టింది. ఈ కథ వినగానే ఈ సినిమాకు నేను పెట్టిన డబ్బు పదింతలు ఎక్కువ రావాలి అని ఆయన అన్నారు. అంతా శివుడి పై వదిలేసి సినిమా రిలీజ్ చేయి. ఆయనే చూసుకుంటాడు అని కూడా అన్నారు. ఆ ధైర్యంతోనే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను” అంటూ తెలిపారు మంచు విష్ణు.
ఆ క్యారెక్టర్ వల్ల నా ఫ్రెండ్ నాపై కోపంగా ఉన్నారు..
శివ బాలాజీ(Shiva balaji )కి అవకాశం కల్పించడంపై కూడా మాట్లాడుతూ.. మొదట ఈ సినిమాలో నా ఫ్రెండ్ కి నేను ఒక క్యారెక్టర్ ఇచ్చాను. కానీ శివ బాలాజీకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనిపించి నా ఫ్రెండును కూడా తీసేసి శివబాలాజీకి నేను ఆ క్యారెక్టర్ ఇచ్చాను. అయితే అప్పటినుండి వాడు నాపై చాలా కోపంగా ఉన్నాడు అంటూ తన ఫ్రెండ్ పేరు చెప్పలేదు మంచు విష్ణు.
గొడవలపై స్పందించిన విష్ణు..
ఇక చివరిగా గొడవల గురించి మాట్లాడుతూ.. ” మా నాన్నకు నేను ఎంతో భయపడతాను. ముఖ్యంగా మా అమ్మానాన్నలంటే ఎంతో గౌరవం,భయం. ఎందుకంటే నేను చేసే పనులు అలాంటివి మరి. మా అమ్మ చాలా ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా రేపో మాపో మాపై చేయి కూడా చేసుకుంటుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా మనోజ్ విషయంలో నాన్న బాధ, కోపం తగ్గితేనే నేను కూడా కాస్త తగ్గుతాను. ఆయన మాటే శాసనం.. ఇక మా ఇంట్లో గొడవ జరుగుతుంది అనే విషయం టీవీలో రాగానే ఇండస్ట్రీలో ఉండే నా స్నేహితులందరూ నాకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. ముందుగా మోహన్ లాల్ (Mohan lal )అంకుల్ ఫోన్ చేసి నన్ను రమ్మంటావా.. అంతా ఓకేనా అన్నారు.. నేను చెప్పినప్పుడు మాత్రమే రండి అంకుల్” అని అన్నాను అంటూ తెలిపారు మంచు విష్ణు..