Kangana Ranaut: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. ఎవరిపై అయినా, ఎలా అయినా కామెంట్స్ చేసేయగలదు. ఆ కామెంట్స్ వల్ల కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయేమో అని ఆలోచించకుండానే ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీలు తన ఖాతాలో వేసుకుంది కంగనా. ముఖ్యంగా బీ టౌన్‌లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో, హీరోయిన్లు అంటే తనకు అస్సలు పడదని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇన్‌డైరెక్ట్‌గా బయటపెట్టింది. అందుకే సినిమాల్లో వారి నటన ఎంత అద్భుతంగా ఉన్నా కూడా ప్రశంసించడానికి సిద్ధంగా ఉండదు కంగనా. అలాగే తాజాగా దీపికా పదుకొనె నటించిన సినిమాల్లో బెస్ట్ అయిన ‘పద్మావత్’ విషయంలో కూడా ఇలాంటి షాకింగ్ కామెంట్సే చేసింది కంగనా రనౌత్.
రెడీ అవుతూనే ఉంటుంది
ప్రస్తుతం కంగనా రనౌత్ తన ‘ఎమర్జెన్సీ’ మూవీని ప్రమోట్ చేసుకుంటూ బిజీగా గడిపేస్తోంది. ఇప్పటికే హిందీ సినిమాల్లో అసలు హీరోయిన్స్‌కు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందనే విషయంలో కంగనా చాలాసార్లు కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మరోసారి ‘పద్మావత్’లో దీపికా పాత్ర గురించి కూడా అలాంటి కామెంట్సే చేసింది ఈ బాలీవుడ్ క్వీన్. ముందుగా ఆ సినిమా ఆఫర్ తనకే వచ్చిందని బయటపెట్టింది. ‘‘నేను సంజయ్ లీలా భన్సాలీని స్క్రిప్ట్ అడిగాను. కానీ నేనెప్పుడూ స్క్రిప్ట్ షేర్ చేయను అని ఆయన చెప్పారు. అప్పుడు హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుంది అని అడిగాను. పెద్దగా ఏముండదు హీరోయిన్ రెడీ అవుతున్నప్పుడు హీరో తనను అద్దంలో నుండి చూస్తాడు అని అన్నారు’’ అని గుర్తుచేసుకుంది కంగనా రనౌత్.
నిజంగా చెప్పారా?
కంగనా రనౌత్ (Kangana Ranaut) చెప్పిన మాటలు విన్న తర్వాత సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) నిజంగానే ఆయన సినిమా గురించి ఇలా చెప్పారా అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలవుతుంది. పైగా తాను కూడా ఆ సినిమా చూసిన తర్వాత దీపికా రెడీ అవ్వడం తప్పా అందులో ఏం లేనట్టు ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది కంగనా. దీంతో ‘పద్మావత్’ సినిమాలో దీపికా యాక్టింగ్‌ను ఇష్టపడేవారు కంగనా కామెంట్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి సినిమా సరిగా చూస్తే తన యాక్టింగ్ ఏంటో అర్థమవుతుందని సలహా ఇస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. టాప్ దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్స్‌ను అసలు సరిగా చూపించరని కూడా వాపోయింది కంగనా.
Also Read: ఇండస్ట్రీలో విషాదం.. యాక్సిడెంట్‌లో 23 ఏళ్ల నటుడు మృతి
వేశ్యల ప్రపంచం
‘‘టాప్ దర్శకుడు హీరోయిన్స్‌ను మంచి పాత్రల్లో అసలు చూపించరు. ఈరోజుల్లో హీరోయిన్స్ చేసే పాత్రలు చాలా పరువు తక్కువగా అనిపిస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు అయితే కేవలం వేశ్యల గురించి చెప్పడానికి అన్నట్టుగా ఉంటుంది. వేశ్యలను తక్కువ చేసి మాట్లాడడానికి నేను ఇలా చెప్పడం లేదు. రజ్జో సినిమాలో నేను కూడా ఒక వేశ్యగానే కనిపించాను’’ అని తెలిపింది. అలా మరోసారి దీపికా పదుకొనె ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసింది కంగనా. తన కామెంట్స్ వల్ల ప్రేక్షకులకు ఎన్నిసార్లు టార్గెట్ అయినా కంగనా పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది.