Sankranthiki Vasthunam Collections : టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ఇది. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ఈ కాంభో మరోసారి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు క్యూకడుతూ ఉండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు కలెక్షన్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గలేదు.. మరి నాలుగు రోజులకు గాను ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 14 వ తేదీన థియేటర్ల లోకి వచ్చింది. బెనిఫిట్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల ను సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం ముందుకు వెళ్తుంది. ఈ మూవీలో వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.. ఆంధ్రా, నైజాం లో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.
కలెక్షన్స్ విషయానికొస్తే.. 1300 స్క్రీన్ల లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే నుంచి మంచి కలెక్షన్స్ ను అందుకుంటుంది.. తొలి రోజు రూ. 45 కోట్లు అందుకుంది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి కేవలం 3 రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసింది. అంతేకాదు రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అలవోకగా కొట్టేసి లాభాలను అందిస్తోంది.. సంక్రాంతి సెలవులు ఇంకా ఉండటంతో ఈ మూవీని చూడటానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. నాలుగో రోజు కూడా కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 25 కోట్ల కలెక్షన్స్ ను అందుకుందని తెలుస్తుంది. మరి ఏ మాత్రం వసూల్ చేసిందో చిత్ర యూనిట్ అధికారక ప్రకటన రావాల్సి.. మొత్తానికి ఈ మూవీతో వెంకీ మామా హిట్ ట్రాక్ లో పడ్డాడు. ఇదే జోరున కలెక్షన్స్ పెరిగితే రూ. 500 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని టాక్.. ప్రస్తుతం వెంకీ టీమ్ ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. త్వరలోనే మరో సినిమాను అనౌన్స్ చెయ్యనున్నారని టాక్.. ఈసారి యాక్షన్ కోణం లో సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్..