India Vs Australia T-20 : భారత్ -ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టీ 20ల సిరీస్ కి రెండు జట్లు సన్నద్ధమయ్యాయి. అప్పుడే తొలి వన్డే ఆడేందుకు విశాఖపట్నం చేరుకున్నాయి. ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా కాకుండా, యంగ్ ఇండియా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో తలపడనుంది. గురువారం రాత్రి 7 గంటలకు తొలి వన్డే ప్రారంభం కానుంది.
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల తీవ్ర గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో జరిగే టీ 20 మ్యాచ్ పై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. అసలు మ్యాచ్ ఉంటుందా? ఉండదా? అని అంతా సందేహాలు పడ్డారు.
కానీ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించదని తెలిపింది. సీనియర్లు లేని జూనియర్ల టీమ్ మరి వరల్డ్ కప్ నెగ్గిన ఆస్ట్రేలియాతో ఎలా నెట్టుకువస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కొందరేమో ఎప్పటిలా వరల్డ్ కప్ లో ఫైనల్ ఓటమికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలని కొటేషన్లు పెడుతున్నారు.
మొత్తం ఐదు టీ 20 సిరీస్ కి వరల్డ్ కప్ ఆడిన ముగ్గురికి మాత్రమే అవకాశం దక్కింది. ఒకరు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మరొకరు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, తను నాలుగో వన్డే, ఐదో వన్డే ఆడుతాడు. ఇషాన్ కిషన్ ఒకరు ఎంపికయ్యారు.
ఇకపోతే మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకి మళ్లీ టీ 20 సిరీస్ లో చోటు దక్కింది. అపార అనుభవం ఉన్న ఆస్ట్రేలియాన్లతో యంగ్ ఇండియా టీమ్ ఎలా ఆడుతుందని వెయిట్ చేస్తున్నారు. మరో ఆరునెలల్లో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కావల్సి ఉండటంతో ఇప్పటి నుంచే సన్నాహక మ్యాచ్ లను బీసీసీఐ నిర్వహిస్తోంది.
వరల్డ్ కప్ 2023కి ముందు కూడా టీమ్ ఇండియా -ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరిగింది. అందులో ఇండియా 2-1 తేడాతో విజయం కూడా సాధించింది. కానీ ఇక్కడ ఫైనల్ లో బోల్తా కొట్టింది. ఇదే విధి వైచిత్రి అంటే అని కొందరు కామెంట్ చేస్తున్నారు.