Vishwak Sen Laila: ప్రముఖ డైరెక్టర్ రామ్ నారాయణ్ (Ram Narayan)దర్శకత్వంలో.. విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా, ఆకాంక్ష శర్మ ( Akanksha Sharma ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం లైలా (Laila). విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం పోషిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి లేడీ గెటప్ పోషించనున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ లేడీ లుక్ కి సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేయగా.. స్టార్ హీరోయిన్ లు సైతం కుళ్ళుకునేలా ఎంతో అందంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అచ్చం అమ్మాయే అన్నట్టుగా తన మేకోవర్ ను మార్చుకొని సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇకపోతే 2025 ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది ఈ చిత్రం. ఈ మేరకు తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.
లైలా మూవీకి ‘ఏ’సర్టిఫికెట్..
తాజాగా ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు నిర్వాహకులు.. ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే 135 నిమిషాల నిడివితో రన్ టైం కూడా లాక్ చేశారు. ఇకపోతే ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా ఏ సర్టిఫికెట్ అనేది అత్యధికంగా చిత్రంలో యాక్షన్, క్రైమ్, వయలెన్స్ తో పాటు అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే ఈ ఏ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇప్పుడు లైలా సినిమాలో యాక్షన్, క్రైమ్, వైలెన్స్ వంటివి ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ సినిమా చాలా రొమాంటిక్ యాంగిల్ లోనే తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే ఇక ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ఈ సినిమాను 18 ఏజ్ కంటే తక్కువ ఉన్నవాళ్లు ఈ మూవీని చూడొద్దు అని సెన్సార్ వాళ్లే చెబుతున్నారు. ఇకపోతే పోస్టర్స్ తో లుక్కు రివీల్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరు, ఈ సినిమాకి ఇప్పుడు ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో ఇదెక్కడి ఘోరం అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఏ రేంజ్ లో ఉంటే సెన్సార్ దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విశ్వక్ సేన్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇకపోతే 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించబోతున్నారు చిత్ర మేకర్స్. సైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి (Sahoo garapati) నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు పెంచడానికి మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ లాంటి గొప్ప నటులు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వస్తే.. మెగా అభిమానులు ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంది. కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు మెగాస్టార్ ని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాకు విశ్వక్ ప్లాన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడాలి.