BigTV English

Vishwak Sen: బాలయ్య అయిపోయాడు.. రంగంలోకి మెగాస్టార్.. అబ్బా ఏం వాడకం సామి..!

Vishwak Sen: బాలయ్య అయిపోయాడు.. రంగంలోకి మెగాస్టార్.. అబ్బా ఏం వాడకం సామి..!

Vishwak Sen: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దర్శకుడిగా, నిర్మాతగా , నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విశ్వక్ సేన్ ఇప్పుడు సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని రాజేంద్రప్రసాద్ వరకు చాలామంది హీరోలు లేడీ గెటప్ లలో నటించి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఆ తరహా జానర్ ల్లో సినిమా తెరకెక్కించాలని, స్టార్ హీరోలను ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే ‘లైలా’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఇందులో ఆడవాళ్లకు మేకప్ వేయడమే కాదు యాక్షన్ రంగంలోకి కూడా దిగగలడు అని నిరూపించాడు.


ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించనున్నారు చిత్ర మేకర్స్. అందులో భాగంగానే ఫిబ్రవరి 9వ తేదీన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అయితే ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి నెటిజెన్స్, అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna)ను తన సినిమాల ఈవెంట్లకు తీసుకొచ్చి భారీ క్రేజ్ సొంతం చేసుకున్నావు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ ని రంగంలోకి దింపుతున్నావు.. ఏం వాడకం సామి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే విశ్వక్ సేన్ ఆలోచనలకి నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సీనియర్ హీరోల సపోర్టు ఉంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మరొకసారి నిరూపిస్తున్నారు విశ్వక్ సేన్. మొత్తానికైతే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారని తెలిసి అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇంకొంతమంది వాడకం అంటే విశ్వక్ సేన్ దే అంటూ కూడా నెగిటివ్ గా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు

లైలా సినిమా విశేషాలు..


విశ్వక్ సేన్ హీరోగా యాక్షన్ కామెడీ చిత్రంగా వస్తున్న లైలా చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో విశ్వక్సేన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్గా నటిస్తోంది. 2025 ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఇటీవల రన్ టైం కూడా ముగించుకుంది. 135 నిమిషాల నిడివితో థియేటర్లలోకి విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమాలో హర్షవర్ధన్, రఘుబాబు, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ , రవి మరియా, అభిమన్యు సింగ్, వినీత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికైతే తొలిసారి లేడీ గెటప్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న విశ్వక్సేన్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×