BigTV English

campaign has Ended: ముగిసిన పార్లమెంటు ఆరో దశ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ఎప్పుడంటే..?

campaign has Ended: ముగిసిన పార్లమెంటు ఆరో దశ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ఎప్పుడంటే..?

Sixth Phase Election campaign has Ended: నేటితో ఆరో దశ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆరో దశలో భాగంగా 58 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 25న పోలింగ్ జరగనున్నది. ఈ 58 స్థానాల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.


ఉత్తర్ ప్రదేశ్ – 14, హర్యానా-10, బీహార్-8, పశ్చిమ బెంగాల్ – 8, ఢిల్లీ – 7, ఒడిశా-6 జార్ఖండ్- 4, జమ్మూ అండ్ కాశ్మీర్ -1 లోక్ సభ స్థానానికి పోలింగ్ జరగనున్నది. భారీ భద్రత నడుమల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ నెల 25న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. అయితే, ఆరో దశ ఎన్నికల పోలింగ్ లో ఢిల్లీ, హర్యానా సీట్లు ఉండడం విశేషం. పార్లమెంటు ఆరో దశ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. గెలుపుపై ఇటు ఆప్, అటు బీజేపీ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇటు చివరి దశ అయినటువంటి పార్లమెంటు ఏడో దశ పోన్నికల పోలింగ్ వచ్చే నెల 1న జరగనున్నది. ఫలితాలు జూన్ 4న రానున్న విషయం తెలిసిందే.


అయితే, దేశంలో పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 7 దశల్లో పార్లమెంటు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఐదు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆరో, ఏడు దశల ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఈ ఏడు దశల్లో ఎన్నికల నిర్వహిస్తున్నది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 543 మంది లోక్ సభ సభ్యులను ఎన్నుకోనున్నారు ప్రజలు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఇటు తెలంగాణలో కూడా 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించింది. వీటి ఫలితాలు జూన్ 4న రానున్న విషయం తెలిసిందే.

Tags

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×